Nalgonda News: నల్లొండ జిల్లాలో ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు
Engineering Colleges: ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలు విడుదలకావడంతో మంచి ఇంజినీరింగ్ కళాశాలల కోసం విద్యార్థులు అన్వేషిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని టాప్ ఇంజినీరింగ్ కళాశాల వివరాలు, కోర్సులు
Nalgonda News: తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలు వెల్లడించడంతో...విద్యార్థులు, తల్లిదండ్రులు మంచి కాలేజీలు వెతుకులాట ప్రారంభించారు. అన్ని వసతులు, ఫ్యాకల్టీ, రవాణా సౌకర్యం, ప్లేస్‌మెంట్ ఉన్న కాలేజీల వైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. నల్గొండ జిల్లాలో ఉన్న టాప్ ఇంజినీరింగ్ కళాశాలలు ఒకసారి చూద్దాం...
నల్గొండ జిల్లాలోని బెస్ట్ ఇంజినీరింగ్ కళాశాలల వివరాలు
విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల
విజ్ఞాన్(Vignan) ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల...సువిశాలమైన 200 ఎకరాల స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలోని ప్రకృతి ఒడిలో ఆకట్టుకుంటుంది ఈ కళాశాల. పేరుకు నల్గొండ(Nalgonda) జిల్లాలో ఉన్నా...హైదరాబాద్(Hyderabad)కు అతి చేరువులో ఉంటుంది విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీ. నిత్యం హైదరాబాద్ నుంచి కాలేజీకి బస్సు సౌకర్యం కూడా ఉంది. తెలంగాణ(Telangana) ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయిస్తారు. ఈ కళాశాలలో ఇంజినీరింగ్‌లో పది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సీఎస్‌ఈ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, మెకానికల్, ఇనిస్ట్రమెంటేషన్, ఈసీఈ, ఈఈఈ, ఐటీ, సివిల్ కోర్సులు అందిస్తోంది.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ
నల్గొండలోని మహాత్మాగాంధీ(Mahathma Gandhi) ప్రభుత్వ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీ(Engineering College)లో కేవలం మూడే మూడు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ కోర్సులను అందిస్తోంది. తెలంగాణ ఎంసెట్ ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది.
గేట్ ఇంజినీరింగ్ కళాశాల
ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ(Kodad)కు సమీపంలో ఉంది గేట్(GATE) కళాశాల. కోదాడ, హుజూరునగర్ పరిసర ప్రాంత ప్రజలకు ఈ కళాశాల ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ దాదాపు 12 ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, మైనింగ్, ఈసీఈ, మెకానికల్, సీఎస్‌ఈ, ఈఈఈ, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులు అందిస్తోంది. సంప్రదాయ ఇంజినీరింగ్ కోర్సులతో పాటు అదనంగా ఇతర కోర్సులు అందించడం ఈ కళాశాల విశేషం.
శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల
హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారికి ఆనుకుని సూర్యాపేట(Suryapet)లో ఉన్న ఈ ఇంజినీరింగ్ కళాశాలలో ఐదు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సీఎస్‌ఈ, సివిల్,ఈసీఈ, మెకానికల్, ఈఈఈ కోర్సులను అందిస్తోంది. తెలంగాణ ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఈ కళాశాలలో సీట్లు ఎంపిక చేసుకోవచ్చు. సువిశాలమైన క్యాంపస్‌తోపాటు....రవాణాకు అన్నివిధాల అనుకూలంగా ఉంటుంది. సూర్యాపేట పట్టణానికి ఆనుకుని కాలేజీ ఉండటం కలిసొచ్చే అంశం.
నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
నిజాం(Nizam) ఇంజినీరింగ్ కళాశాల కూడా పేరుకు నల్గొండ జిల్లా అయినా...హైదరాబాద్‌కు అత్యంత చేరువులో ఉంది. రామోజీఫిల్మ్‌సిటీకి సమీపంలోనే దేశ్‌ముఖ్(Deshmuk)లో ఉన్న ఈ కళాశాలలో సీఎస్‌ఈ, సివిల్, మెకానికల్, ఈసీఈ కోర్సులను అందిస్తోంది. రవాణా పరంగా ఎంతో అనువుగా ఉంటుంది. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం కలిసిరానుంది. ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది.
అరోరా ఇంజినీరింగ్ కళాశాల
హైదరాబాద్ నుంచి వరంగల్ రహదారిలోని భువనగిరిలో అరోరా ఇంజినీరింగ్ కళాశాల ఉంది. ఇక్కడ సీఎస్‌ఈ, సివిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, మెకానికల్, ఈఈఈ,ఈసీఈ, డేటా సైన్స్ కోర్సులను అందిస్తోంది.
ఇవేగాక శారద, మధిర, రామానంద తీర్థ, అడుసుమిల్లి విజయ, వాత్సల్య, కోదాడ, తుడిరామిరెడ్డి వంటి ఇంజినీరింగ్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల ఆసక్తిని బట్టి కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు.