అన్వేషించండి

CPGET Results: 'సీపీగెట్-2023' ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్! రిజల్ట్స్ ఎప్పుడంటే?

తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)-2023’ ప్రవేశ పరీక్షల ఫలితాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)-2023’ ప్రవేశ పరీక్షల ఫలితాలను త్వరలోనే వెల్లడించనున్నారు. జూన్ 30 నుంచి జులై 10 వరకు ఆన్‌లైన్ పరీక్షల ఫలితాలను ఆగస్టు 18న విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సీపీగెట్ పరీక్షలకు మొత్తం 69,439 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. 

సీపీగెట్ ద్వారా ఉస్మానియా, కాక‌తీయ‌, పాల‌మూరు, మ‌హాత్మాగాంధీ, శాతవాహ‌న‌, తెలంగాణ‌, జేఎన్టీయూహెచ్, మ‌హిళా వ‌ర్సిటీల్లో ప్రవేశాలు క‌ల్పించ‌నున్నారు. ఈ యూనివర్సిటీల్లోని ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర వంటి సంప్రదాయ కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు. మొత్తం 84 సబ్జెక్టులకు రాష్ట్రంలోని 12 జోన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలోని 320 కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా కళాశాలల్లో మొత్తం 50 కోర్సుల్లో 112 విభాగాలకు విద్యార్థులు ప్రవేశాలు కల్పిస్తారు. 

ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంసీజే, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు.

ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా, కాక‌తీయ‌, పాల‌మూరు, మ‌హాత్మాగాంధీ, శాతవాహ‌న‌, తెలంగాణ‌, జేఎన్టీయూహెచ్, తెలంగాణ మ‌హిళా వ‌ర్సిటీలు సీపీగెట్ పరీక్ష ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.

డిగ్రీ ఏదైనా.. పీజీలో నచ్చిన కోర్సు..
➥ రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది ఇంతే సంఖ్యలో సీట్లున్నా, చేరిన వారి సంఖ్య 22,812 మాత్రమే. వీరిలోనూ 16,163 (71%) మహిళలు, 6,649 (29%) పురుషులు చేశారు.
➥ డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆఖరుకు ఎంబీబీఎస్, బీటెక్‌ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్‌ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్‌ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే.
➥ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కోటాను 5% నుంచి 20%కి పెంచారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్‌ న్యూమరరీ పోస్టులు క్రియేట్‌ చేస్తారు. ఆన్‌లైన్, డిస్టెన్స్‌ మోడ్‌లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. 

ALSO READ:

ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా!
గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) 2023 విద్యా సంవత్సరానికి రెండో సెషన్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ, ఎండీ, ఎంఎస్‌, ఎండీఎస్‌, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

పీఎం యశస్వి స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం యశస్వి’ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ దరఖాస్తు గడువు పొడిగించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పొడిగించింది. ఈ మేరకు ఆగస్టు 11న ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఆగస్టు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 30 వేల స్కాలర్‌షిప్స్‌ కోసం ఎన్‌టీఏ యశస్వి (యంగ్‌ అచీవర్స్‌ స్కాలర్‌షిప్‌ అవార్డు స్కీమ్‌ ఫర్‌ వైబ్రెంట్‌ ఇండియా) పరీక్ష-2023 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget