AIIMS PhD: ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా!
గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) 2023 విద్యా సంవత్సరానికి రెండో సెషన్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
AIIMS Gorakhpur PhD Session- 2023: గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) 2023 విద్యా సంవత్సరానికి రెండో సెషన్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, ఎండీఎస్, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రోగ్రామ్ వివరాలు..
* డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) సెషన్- 2 ప్రోగ్రామ్
సబ్జెక్టులు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఇమ్యునాలజీ, జెనెటిక్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, ఎండీఎస్, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ కేటగిరీకి రూ.1500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1200. దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచిమినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు AIIMS - Gorakhpur, payable at Gorakhpur పేరిట డిడి తీయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు హార్డ్‌కాపీకి డిడి జతచేసి సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా చేరేలా పంపాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
* దరఖాస్తుకు చివరి తేదీ: 31.08.2023. (5.00pm)
* దరఖాస్తుల పరిశీలన ఫలితాలు-(అంగీకారం/తిరస్కరణ): 05.09.2023.
* తాత్కాలికంగా తిరస్కరించబడిన దరఖాస్తుల క్రమబద్ధీకరణకు అవసరమైన పత్రాలను సమర్పించడానికి చివరితేదీ: 12.09.2023.
* అడ్మిట్ కార్డ్ విడుదల: 20.09.2023.
* రాత పరీక్ష తేదీ: 03.10.2023.
* రాత పరీక్ష ఫలితాల వెల్లడి: 13.10.2023.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
PhD committee,
AIIMS, Kunraghat,
Gorakhpur U.P. 273008.
ALSO READ:
టీఎస్ ఐసెట్-2023 కౌన్సెలింగ్ వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!
తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6, 7 తేదీల్లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తదనంతరం సెప్టెంబరు 8 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్లను సెప్టెంబర్ 17న కేటాయించనున్నారు. సెప్టెంబరు 22 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తాంచనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
పీఎం యశస్వి స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం యశస్వి’ స్కాలర్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు పొడిగించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. ఈ మేరకు ఆగస్టు 11న ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఆగస్టు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 30 వేల స్కాలర్‌షిప్స్ కోసం ఎన్‌టీఏ యశస్వి (యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డు స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా) పరీక్ష-2023 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..