JEE Main 2024: జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్‌కు నేటితో ఆఖరు, పరీక్ష వివరాలు ఇలా
JEE Main: దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2024 మొదటి విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు డిసెంబరు 4తో ముగియనుంది.
JEE Main 2024 Registration: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు(IITs), ఎన్‌ఐటీలు(NITs), ట్రిపుల్ ఐటీలు (IIITs), కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2024 మొదటి విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు డిసెంబరు 4తో ముగియనుంది. విద్యార్థులు రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే రాత్రి 11.50 గంటల వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సమయంలో ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.
ఈ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటి సెషన్, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో జేఈఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు జనవరి సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నవంబరు 1న విడుదల చేసింది. తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 12న ఫలితాలను విడుదల చేస్తారు.
వివరాలు..
అర్హతలు..
➥ బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తోపాట కెమిస్ట్రీ/బయాలజీ/బయోటెక్నాలజీ/ సాంకేతిక వృత్తిపరమైన సబ్జెక్టుల్లో ఏదైనా కలిగి ఉండాలి.
➥ బీఆర్క్ కోర్సలకు ప్రవేశాలు కోరేవారు ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఆప్షనల్ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. (లేదా) పదో తరగతితోపాటు మూడేళ్ల డిప్లొమా (మ్యాథమెటిక్స్) ఉండాలి.
➥ ఇక బీప్లానింగ్‌కు తప్పనిసరి సబ్జెక్టుతోపాటు గణితం కూడా ఉండాలి.
➥ ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులు ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65 శాతం ఉండాాలి.
పరీక్ష ఫీజు వివరాలు..
పరీక్ష విధానం..
➥పేపర్-1(బీటెక్, బీఈ) ఇలా..
బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్‌ను మొత్తం మూడు సబ్జెక్ట్‌లలో రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు. సెక్షన్-ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో(ఎంసీక్యూలతో) ఉంటుంది. సెక్షన్-బిలో న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలుంటాయి.సెక్షన్-బిలో 10 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. 0.25 శాతం నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది.
➥ పేపర్-2(ఎ) బీఆర్క్ పరీక్ష..
నిట్‌లు,ట్రిపుల్ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ విభాగంలో ఎంసీక్యూల్లో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. అదే విభాగంలో న్యూమరికల్ ప్రశ్నలలో పది ప్రశ్నలకుగాను అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి. డ్రాయింగ్ టెస్ట్‌లో మాత్రం రెండు అంశాలను ఇచ్చి డ్రాయింగ్ వేయమంటారు. ఒక్కో టాపిక్‌కు 50 మార్కులు.
➥ పేపర్-2(బి)బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ పరీక్ష..
బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్-2బి మూడు విభాగాలుగా ఉంటుంది. మ్యాథమెటిక్స్‌లోని న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి. మూడు పరీక్షలకు కేటాయించిన సమయం మూడు గంటలు. బీఆర్క్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ రెండు పేపర్లకు మూడున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది.
దరఖాస్తు సమయంలో అవసరమయ్యే పత్రాలు..
➥ దరఖాస్తుదారు ఫోటో స్కాన్ చేసిన కాపీ
➥ దరఖాస్తుదారు సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీ
➥ కేటగిరీ సర్టిఫికెట్లు(వర్తిస్తే)
➥ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ మొదలైన ఫోటో గుర్తింపు రుజువు
➥ 10వ తరగతి మార్కు షీట్
➥ ఇంటర్మీడియట్ మార్క్ షీట్.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.11.2023
➥ దరఖాస్తుకు చివరితేదీ: 30.11.2023 (04.12.2023 వరకు పొడిగించారు)
➥ ఫీజు చెల్లింపునకు చివరితేదీ: 04.12.2023 (రాత్రి 11.50 గంటల వరకు)
➥ పరీక్ష కేంద్రాల (నగరాలు) ప్రకటన: 2024, జనవరి రెండో వారంలో
➥ అడ్మిట్‌కార్డులు: పరీక్ష తేదీకి 3 రోజుల ముందు
➥ ఆన్‌లైన్ పరీక్షలు: 24.01.2024 నుంచి 01.02.2024 వరకు
➥ పరీక్ష ఫలితాలు: 12.02.2024.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
తెలంగాణలో: హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.
ఏపీలో: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, పాపం పరే, ప్రొద్దటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.