IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

మిలినియల్స్‌తో పోటీ మామూలుగా ఉండదు. మరి మీరు పోటీ పడతారా... లైఫ్‌లో పడిపోతారా.... ఛాయిస్‌ మీదే... చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మిమ్మల్ని మీరు అప్‌డేట్‌ చేసుకుంటే మిలినియల్స్‌కే మీరు బాస్‌ కావచ్చు.

FOLLOW US: 

డిగ్రీలు, బీటెక్‌లు కంప్లీట్ చేసేశారు. ఉద్యోగాల్లోకి వచ్చాశారు. మొబైల్‌లో వచ్చే యాప్‌లు అప్‌డేట్‌ చేస్తున్నారు సరే.. మరి మీరు అప్‌డేట్‌ అవుతున్నారా!. 

గంటల ముల్లును సెకన్లు ముల్లులా చేసి పరిగెత్తే ఈ కాలంలో మనల్ని మనం అప్‌డేట్‌ చేసుకుంటూ వెళ్లాలి. లేకుంటే అవుట్‌డేటెడ్‌ అయిపోతాం. కొత్త వెర్షన్ వస్తే వేలు ఖర్చు పెట్టి ఫోన్లనే క్షణాల్లో మార్చేస్తున్నారు. లేటెస్ట్ మోడల్‌కు వెళ్లిపోతున్నారు. మరి లక్షల్లో శాలరీ ఇస్తున్నా మీరు అప్‌డేట్‌ కాకుంటే ఏం చేస్తారు. మీ ప్లేస్‌లో వేరే లేటెస్ట్‌ వెర్షన్ వ్యక్తి వస్తాడు. 

అందుకే మొబైల్‌లో యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నట్టే మీరు అప్‌డేట్‌ అవ్వాలి. మీరు ఎంచుకున్న సెక్టార్‌లోనే కాదు. మీకు ఆసక్తి ఉన్న ఏ సెక్టార్‌లోనైనా కొత్త విషయాలు నేర్చుకోవాలి.  అప్పుడే అప్‌ టు డేట్‌గా ఉంటారు. 

కొత్త కోర్సులు నేర్చుకోవాలంటే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మళ్లీ పుస్తకాలు పట్టుకొని ఇనిస్టిట్యూట్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. చేతిలో మొబైల్‌ ఉంటే చాలు. కాస్త కాలాన్ని ఖర్చు చేస్తే ట్రెండింగ్‌లో ఉంటారు. 

మీ లాంటి వాళ్ల కోసమే టాప్‌ యూనివర్శిటీలు, కాలేజీలు వెయిట్‌ చేస్తున్నాయి. కోర్సులు డిజైన్‌ చేస్తున్నాయి. చాలా సంస్థలు ఉచితంగా వీటిని అందిస్తున్నాయి. మీరు కాస్త శ్రద్ధ పెడితే చాలు లేటెస్ట్ టెక్నాలజీ మీ మెదడులో ఉంటుంది. 

Udemy, Coursera, edX, Swayam వంటి సంస్థలు అన్ని రంగాల్లోని బేసిక్ థింగ్స్‌ నుంచి అన్నింటినీ వివరణాత్మకంగా చెప్పేస్తున్నారు. వీటిలో కచ్చితంగా నేర్చుకోవాల్సిన కొన్ని కోర్సులను మేం మీకు సూచిస్తున్నాం. డైలీ లైఫ్‌లో మీకు ఎప్పుడైనా వీటి అవసరం మీకు రానుంది. 

లాజిస్టిక్‌ అండ్‌ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కోర్సులు

ఇప్పుడు చాలా కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌హోం బండి ఎక్కేశాయి. అందుకే ఎప్పుడు ఏ పని చేయాలో ప్రతిదీ ప్రోగ్రామింగ్ చేసేస్తున్నారు. 
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి పనిని మేనేజ్‌ చేసుకొని వ్యక్తిగత జీవితంలో ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇలాంటి టైంలోనే లాజిస్టిక్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల అవసరం ఎంతైనా ఉంది. 
అడిలైడ్‌ యూనివర్శిటీ డిజైన్ చేసిన ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి ఉచితంగా అందిస్తంది. వర్క్‌ లైఫ్‌ను పర్శనల్‌ లైఫ్‌ను ఎలా మేనేజ్‌ చేసుకోవాలని చెబుతుంది. వర్క్‌లైఫ్‌లో కూడా పనుల షెడ్యూలింగ్‌పై వివరమైన డీటేల్స్‌ను ఇంట్రడక్షన్ టు ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌లో నేర్పుతుంది. 


సమస్యల పరిష్కారం, నిర్ణయాలు తీసుకోవడం అంత సులభమా?

చాలా మందికి సమస్య పరిష్కారం అంటే చాలా ఇష్టం. క్లిష్ట సమయంలో నిర్ణయాలు తీసుకోవడాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంటారు. అన్ని వేళల్లో తీసుకున్న నిర్ణయం క్లిక్‌ అవుతుందని చెప్పలేదు. కొన్నిసార్లు ఏమోషనల్‌గా నిర్ణయాలు తీసుకొని బోల్తాపడుతుంటారు. అలాంటి వారి కోసమే ఎఫెక్టివ్‌ ప్రోబ్లమ్‌ సాల్వింగ్‌ అండ్‌ డెసిసన్‌ మేకింగ్ కోర్సు డిజైన్ చేశారు.  కాన్ఫిడెన్స్‌గా నైపుణ్యంగా నిర్ణయాలు తీసుకోవడంపై ఈ కోర్సులో చాలా అంశాలు పొందుపరిచారు. 

కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు

మీరు పెద్ద కంప్యూటర్ నిపుణుడైపోయి అర్జెంట్‌గా పోగ్రామ్స్‌ రాయాల్సిన పని లేదు. కానీ కాస్త పరిజ్ఞానం మాత్రం చాలా అవసరం. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్స్, వస్తున్న యాప్స్‌, వాడుకలో ఉన్న సెక్యూరిటీ థింగ్స్‌ తెలియాలంటే మాత్రం కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం లేకుంటే ఇబ్బంది పడతారు. అందుకే హార్వార్డ్‌ యూనివర్సిటీ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్‌ సైన్స్ పేరుతో బేసిక్‌ నాలెడ్జ్‌ కోసం  కోర్సును డెవలప్ చేసింది. ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత చాలా అంశాలపై మీకు మంచి అవగాహన వస్తుందన్నది మాత్రం గ్యారంటీ. 

మానసిక ప్రశాంత, ఆనందం కోసం ఏం చేయాలి?

ఎంత సంపాదించినా ఎంత కష్టపడిన చివరకు కావాల్సింది మాత్రం మానసిక ప్రశాంతత, ఆనందం. ఈరెండు లేనప్పుడు ఏం సంపాదించినా ఎంత సంపాదించిన వృథా అవుతుంది. 

ఇప్పుడు చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీని కోసం కోట్లు ఖర్చు పెడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మానసిక ప్రశాంతత లేని లైఫ్‌ చాలా సమస్యలకు కారణమవుతుంది. ఇది లేనప్పుడు నిద్రపట్టదు. ఓపిక నశిస్తుంది. అసహనం పెరిగిపోతుంది. కొన్నిసార్లు పిచ్చెక్కుతుంది. 

దీని కోసం కాలిఫోర్నియా యూనివర్శిటీ దసైన్స్‌ ఆప్‌ హ్యాపీనెస్‌ పేరుతో కోర్సు డిజైన్ చేసింది. పాజిటీవ్‌గా ఆలోచించడం, ఎమోషనల్‌ ఎలా కంట్రోల్డ్‌గా ఉండాలో నేర్పిస్తుందీ కోర్సు.  

ఉచితంగా మెషిన్ లెర్నింగ్‌ కోర్సు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఇప్పుడు ప్రపంచాన్నే ఊపేస్తున్న సరికొత్త టెక్నాలజీ. దీని కారణంగా రాబోయే కొన్నేళ్లలో చాలా మంది  ఉద్యోగాలు కోల్పోవడం ఖాయం. ఒకప్పుడు మీరు ఏదైనా కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేస్తే వెంటనే అటు నుంచి వ్యక్తులు మాట్లాడే వాళ్లు ఇప్పుడు మెషిన్లు మాట్లాడుతున్నాయి. అలా ప్రతి రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర పెరిగిపోతోంది. అందుకే ఇది నేర్చుకోవడం తప్పనిసరి అవుతుంది. 

ఇలాంటి సమస్యను ముందే గ్రహించిన స్టాన్‌పోర్డ్ యూనివర్శిటీ మెషిన్ లెర్నింగ్ పేరుతో డిజైన్ చేసిన కోర్సులో చాలా అంశాలు పొందుపరిచింది. ఈ రంగంలోకి వెళ్లాలనుకున్న వారికి బేసిక్స్‌ నేర్చుకోవడానికి ఇది మంచి కోర్సుగా చెప్పొచ్చు. 
పైన చెప్పిన  కోర్సులు పూర్తి ఉచితం. ఇవన్నీ బేసిక్‌ నాలెడ్జ్‌ కోసమే. ఇంకా డీప్‌గా స్టడీ చేయాలంటే మాత్రం కాస్త ఖర్చు పెట్టాలి. సర్వైవల్‌ కోసమే ఇప్పుడు చెప్పిన కోర్సులు సరిపోతాయి. 

Also Read: Horoscope Today 19th January 2022: ఈ రాశివారికి జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమవుతాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి..

Also Read: NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?

Also Read: Gold-Silver Price: అతి స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. రూ.300 పెరిగిన వెండి, నేటి తాజా ధరలు ఇవీ..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 19 Jan 2022 03:19 PM (IST) Tags: Swayam Coursera Udemy edX Online Course

సంబంధిత కథనాలు

Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు 

Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు 

TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే

TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు

Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు

Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు

Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు

టాప్ స్టోరీస్

Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!

Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!

Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!

Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!

Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!

Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!