NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?
నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.
నవోదయ విద్యాలయ సమితి(ఎన్వీఎస్) వివిధ గ్రూప్ ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు.. navodaya.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 10, 2022 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మొత్తం 1,925 పోస్టులను భర్తీ జరగనుంది.
అసిస్టెంట్ కమిషనర్: 7, మహిళా స్టాఫ్ నర్స్: 82, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 10, ఆడిట్ అసిస్టెంట్: 11, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్: 4, జూనియర్ ఇంజనీర్: 1, స్టెనోగ్రాఫర్: 22, కంప్యూటర్ ఆపరేటర్: 4, క్యాటరింగ్ అసిస్టెంట్: 87, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 630, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 273, ల్యాబ్ అటెండెంట్: 142, మెస్ హెల్పర్: 629, మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 23 పోస్టులు ఉన్నాయి.
అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inలో అప్లై చేసుకోవాలి. వెబ్ సైట్ ఒపెన్ చేశాక.. వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. ఏ పోస్ట్‌కి అప్లే చేస్తున్నారో చూసుకోండి. ఆ తర్వాత... దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఎంపిక ప్రక్రియలో అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ (అడ్మిన్), జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖస్తు చేసుకునేవారు.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూలో వారి పనితీరు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అసిస్టెంట్ కమిషనర్ పోస్టుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజు.. రూ. 1,500, మహిళా స్టాఫ్ నర్స్ రూ. 1,200, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, ఎంటీఎస్ రూ. 750, ఇతర పోస్టులకు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: Railway Recruitment 2022: పదో తరగతి విద్యార్హతతో రైల్వే ఉద్యోగాలు.. రెండు వేలకుపైగా ఖాళీలు.
Also Read: BSF Recruitment: బీఎస్ఎఫ్ లో ఉద్యోగాలు.. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఎలా అప్లై చేయాలంటే..
Also Read: Infosys: మీది గ్రాడ్యుయేషన్ అయిందా? ఇన్ఫోసిస్ సంస్థ గుడ్‌న్యూస్, భారీగా ఉద్యోగాలు
Also Read: Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ... ఆంక్షల నుంచి వీటికి మినహాయింపు