By: ABP Desam | Updated at : 19 Jan 2022 06:41 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు అతి స్వల్పంగా గ్రాముకు రూ.2 తగ్గింది. కానీ వెండి ధర మాత్రం కిలోకు రూ.300 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,970 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,070 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.300 పెరిగి రూ.65,800గా అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,970 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,070గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,800 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర నిలకడగానే ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,970 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,070గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,800గానే ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో బంగారం ధరల్లో కూడా స్వల్ప మార్పు చోటు చేసుకుంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,320గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,420గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,090 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,090 గా ఉంది.
ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు అతి తక్కువగా తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం నేడు రూ.23,110 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: E-Cell IIT Hyderabad: వ్యాపారవేత్తగా ఎదగాలని ఉందా? 'ఐఐటీ హైదరాబాద్' నిర్వహించే ఈ సదస్సు మీకోసమే!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!
Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ
World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?
Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలమ్మ
Stock Market Weekly Review: గతవారం నష్టంతో పోలిస్తే రూ.10 లక్షల కోట్లు మిగిలినట్టే!
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి