అన్వేషించండి

TS PECET 2024 Results: టీజీ పీఈసెట్ ఫలితాలు విడుదల, 96.48 శాతం ఉత్తీర్ణత న‌మోదు

TS PECET Results: తెలంగాణలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీఈసెట్‌-2024 ఫ‌లితాలు జూన్ 19న విడుద‌ల‌య్యాయి. ఫలితాల్లో మొత్తం 96.48 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది.

Telangana PECET 2024 Results: తెలంగాణలోని వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీజీ పీఈసెట్ (TG PECET)- 2024' ఫలితాలు జూన్ 19న విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ పీఈసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించి బీపీఈడీ, డీపీఈడీ రెండు విభాగాలు క‌లిపి మొత్తం 96.48 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. ఇందులో బీపీఈడీకి 1650 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. 1198 మంది ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు.  వీరిలో 1156 మంది (96.49 శాతం) ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక డీపీఈడీకి 742 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. 507 మంది హాజ‌ర‌య్యారు. వీరిలో 489 మంది (96.45 శాతం) ఉత్తీర్ణ‌త సాధించారు.

ప్రకటించిన షెడ్యూలు.. ప్రకారం జూన్ 10 నుంచి 13 వరకు శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలో పీఈసెట్ -  ఫిజికల్ ఈవెంట్లు, స్కిల్ టెస్టులు నిర్వహించిన సంగతి తెలిసిందే. పీఈసెట్ పరీక్షల ద్వారా రాష్ట్రంలోని 20 వ్యాయామ కళాశాలల్లో బీపీఎడ్‌(B.PEd), డీపీఎడ్(D.PEd) కోర్సుల్లో సీట్లను భర్తీచేయనున్నారు. వీటిలో 16 బీపీఎడ్ కాలేజీల్లో 1660 సీట్లు, నాలుగు డీపీఎడ్ కాలేజీల్లో 350 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

TG PECET-2024 ర్యాంక్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి...

➥ పీఈసెట్ ర్యాంకు కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://pecet.tsche.ac.in/HomePage.aspx

➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Rank Card' అనే లింక్‌ మీద క్లిక్ చేయాలి.

➥ అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'View Rank Card' బటన్ మీద క్లిక్ చేయాలి. 

➥ వివరాలు నమోదుచేయగానే ర్యాంక్ కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శనమిస్తుంది.

➥ అభ్యర్థులు ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

TG PECET 2024 ర్యాంకు కార్డు కోసం క్లిక్ చేయండి..

ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ విధానం..

➥  మొత్తం 400 మార్కులకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (ఫిజికల్ ఈవెంట్లు) నిర్వహిస్తారు. ఇందులో మొత్తం నాలుగు ఈవెంట్లు ఉంటాయి. ఒక్కో ఈవెంట్‌కు 100 మార్కులు కేటాయించారు.

➥ వీటిలో పురుషులకు 100 మీటర్ల పరుగు-100 మార్కులు, 800 మీటర్ల పరుగు-100 మార్కులు, షాట్‌పుట్(6 కేజీలు)-100 మార్కులు, లాంగ్ జంప్/హైజంప్-100 మార్కులు ఉంటాయి.

➥ ఇక మహిళలకు 100 మీటర్ల పరుగు-100 మార్కులు, 400 మీటర్ల పరుగు-100 మార్కులు, షాట్‌పుట్(4 కేజీలు)-100 మార్కులు, లాంగ్ జంప్/హైజంప్-100 మార్కులు ఉంటాయి.

➥ గర్భిణీ స్త్రీలు ఫిజికల్ ఈవెంట్లకు అనర్హులు.

స్కిల్ టెస్ట్ (Skill Test) ఇలా..

ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కింది స్పోర్ట్స్ విభాగాల్లో నైపుణ్యాలు పరీక్షిస్తారు. 

అవి: బాల్ బ్యాడ్మిండన్, బాస్కెట్ బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, వాలీబాల్.

తెలంగాణలోని వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ పీఈసెట్- 2024 నోటిఫికేషన్ శాతావాహన యూనివర్సిటీ ఏపీ ఉన్నతవిద్యామండలి పక్షాన మార్చి 12న వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిద్వారా బీపీఎడ్‌(B.PEd), డీపీఎడ్(D.PEd) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 14న ప్రారంభంకాగా.. ఎలాంటి ఆలస్య రుసుములేకుండా మే  25 వరకు ఆన్‌లైన్‌ ద‌రఖాస్తులు స్వీకరించారు. అయితే రూ.500 ఆల‌స్య రుసుముతో మే 31 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ు స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 10 నుంచి 13 వ‌ర‌కు పరీక్షలు నిర్వహించ‌నున్నారు. జూన్ నాలుగో వారంలో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Mike Tyson Vs Jake Paul: సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Mike Tyson Vs Jake Paul: సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Game Changer: ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Embed widget