TET Answer Key: తెలంగాణ టెట్-2024 ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం
TG TET 2024: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష-2024 పరీక్షకు సంబంధించిన పేపర్-1, పేపర్-2 పరీక్షల ఆన్సర్ కీ, అభ్యర్థుల సమాధానపత్రాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
TET Preliminary Answer Key: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TGTET)-2024కు సంబంధించిన పేపర్-1, 2 ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'లు జూన్ 3న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచారు. ఆన్సర్ కీలతోపాటు అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు జనరల్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ, ఎగ్జామ్ పేపర్ వివరాలు నమోదుచేసి తమ రెస్పాన్స్ షీట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్నపత్రాలతోపాటు ఆన్సర్ కీ చూసుకోవచ్చు. అభ్యర్థులకు ఒకవేళ ప్రాథమిక 'కీ'పై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం తుది కీని వెల్లడించనున్నారు. టెట్ ఫలితాలు జూన్ 12న వెల్లడి కానున్నాయి. ప్రభుత్వ టీచర్లుగా నియమితులు కావాలంటే టెట్ అర్హత తప్పనిసరి. వీరుమాత్రమే డీఎస్సీ లేదా టీఆర్టీ (టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) రాయడానికి అర్హులు.
TET 2024 Response Sheets
TET 2024 Initial Key
రాష్ట్రంలో మే 20 నుంచి జూన 2వరకు టెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష ప్రక్రియ పూర్తవడంతో జూన్ 3న ప్రాథమిక కీని అధికారులు విడుదల చేశారు. టెట్ పరీక్షలకు సంబంధించి పేపర్-1 పరీక్షకు మొత్తం 99,958 మంది దరఖాస్తు చేసుకోగా 86.03 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా పేపర్-2 పరీక్షకు 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా.. 82.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
టెట్ పరీక్ష విధానం, అర్హత మార్కులు..
టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు. పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.
జూన్ 20 వరకు డీఎస్సీ దరఖాస్తుకు అవకాశం..
తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2024 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభంకాగా... డీఎస్సీకి ముందు టెట్ నిర్వహణ తప్పనిసరి అని కోర్టు ఆదేశించడంతో ఏప్రిల్ 2తో ముగియాల్సిన గడువును జూన్ 20 వరకు పొడిగించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 17 నుంచి 31 వరకు టీఎస్ డీఎస్సీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా 37,700 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. దీంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 2.14 లక్షల మంది వరకు దరఖాస్తులు సమర్పించారు. జూన్ 12న టెట్ ఫలితాలు వెలువడితే.. డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకునేవారిక సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..