JEE Advanced Toppers: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థికి ఆలిండియా టాప్ ర్యాంకు, అమ్మాయిల్లోనూ మనమే!
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి చిద్విలాస్ రెడ్డి టాపర్‌గా నిలిచారు. చిద్విలాస్ 360కి గాను 341 మార్కులు సాధించి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకులో నిలిచాడు.
ఐఐటీల్లో బీటెక్ సీట్ భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను జూన్ 18న విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 4న జరిగి పరీక్షకు దాదాపు 1.80 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో 1,39,727 మంది అబ్బాయిలు ఉండగా.. 40,645 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో మొత్తం 43,773 మంది అర్హత సాధించారు. వీరిలో అబ్బాయిలు 36,264 మంది, అమ్మాయిలు 7,509 మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 30 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు ఈ పరీక్షలో కటాఫ్ మార్కులు నిర్ణయించి సుమారు 45 వేల మందిని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సిలింగ్‌కు అర్హత కల్పిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
హైదరాబాద్ జోన్ విద్యార్థుల జోరు..
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి చిద్విలాస్ రెడ్డి టాపర్‌గా నిలిచారు. చిద్విలాస్ 360కి గాను 341 మార్కులు సాధించి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకులో నిలిచాడు. ఇక 298 మార్కులతో హైదరాబాద్ జోన్ కు చెందిన నాగ భవ్యశ్రీ బాలికల విభాగంలో ప్రధమ స్థానంలో నిలవడం విశేషం. భవ్యశ్రీ జాతీయ స్థాయిలో 56వ ర్యాంకులో నిలిచింది. టాప్ టెన్ ర్యాంకర్స్‌లో హైదరాబాద్ ఐఐటీ జోన్ విద్యార్థులు ఆరుగురు ఉండటం విశేషం. వావిలాల చిద్విలాస్ రెడ్డికి 1వ ర్యాంకు, రమేష్ సూర్య తేజకు 2వ ర్యాంకు, అడ్డగడ వెంకట శివరామ్‌కు 5వ ర్యాంకు, బిక్కిన అభినవ్ చౌదరికి 7వ ర్యాంకు, నాగిరెడ్డి బాలాజీ రెడ్డికి 9వ ర్యాంకు, యక్కంటి పాణి వేంకట మనీంధర్ రెడ్డికి 10వ ర్యాంకు వచ్చింది.
టాప్-10 ర్యాంకర్లు వీరే..
1వ ర్యాంకు - వావిలాల చిద్విలాస్ రెడ్డి
2వ ర్యాంకు - రమేశ్ సూర్యతేజ
3వ ర్యాంకు - రిషి కార్లా
4వ ర్యాంకు - రాఘవ్ గోయల్
5వ ర్యాంకు - అడ్డగాడ వెంకట శివరామ్
6వ ర్యాంకు - ప్రభవ్ కందేల్వాల్
7వ ర్యాంకు - బిక్కిన అభినవ్ చౌదరి
8వ ర్యాంకు - మలై కేడియా
8వ ర్యాంకు - నాగిరెడ్డి బాలాజీ రెడ్డి
10వ ర్యాంకు - యక్కంటి ఫని వెంకట మనీందర్ రెడ్డి
ఏఏటీ రిజిస్ట్రేషన్ ప్రారంభం..
బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) రిజిస్ట్రేషన ప్రక్రియ ప్రారంభమైంది. వారణాసి, ఖరగ్‌పూర్, రూర్కీల్లోని ఐఐటీల్లో బీఆర్క్ (ఆర్కిటెక్చర్)కోర్సులను నిర్వహిస్తున్నారు. జూన్ 18,19 తేదీల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్ ద్వారా ఏఏటీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 21న ఏఏటీ పరీక్ష నిర్వహించి, జూన్ 24న ఫలితాలను ప్రకటించనున్నారు.