అన్వేషించండి

TG LAWCET: లాసెట్ అభ్యర్థులకు అలర్ట్ - కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది, రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే?

TS LAWCET: తెలంగాణలో న్యాయకోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 20 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కొనసాగనుంది. ఆగస్టు 27న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.

TG LAWCET Counselling Schedule: తెలంగాణలోని న్యాయకళాశాలల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జులై 24న వెలువడింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఆగస్టు 5 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక ఆగస్టు 22, 23 తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్‌‌ఆప్షన్లు మార్చుకునేందుకు ఆగస్టు 24న అవకాశం ఇచ్చారు. ఆగస్టు 27న కళాశాలలవారీగా సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన వారు ఆగస్టు 28 నుంచి 30 వరకు ఆయా కళాశాలల్లో నిర్ణీత ట్యూషన్ ఫీజు రసీదుతో, ఒరిజినల్ ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జులై 23న ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి అధ్యక్షతన ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ లా కళాశాలల్లో న్యాయ విద్య సీట్ల భర్తీకి ఆగస్టు 5 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను తాజాగా అధికారులు విడుదల చేశారు. 

8 వేలకుపైగా సీట్లు అందుబాటులో..
లాసెట్/ పీజీఎల్‌సెట్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మూడేళ్లు/ఐదేళ్ల ఎల్‌బీబీ, ఎల్‌ఎల్‌లఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB) కోర్సులతోపాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సులకు సంబంధించి 8 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కన్వీనర్‌ కోటా సీట్లు 7 వేల వరకు ఉన్నాయి. ఇందులో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి సంబంధించి రాష్ట్రంలోని 22 కళాశాలల్లో 4,790 సీట్లు; ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీకి సంబంధించి రాష్ట్రంలోని 19 కళాశాలల్లో 2,280 సీట్లు; రెండేళ్ల పీజీ లాడిగ్రీకి సంబంధించి రాష్ట్రంలోని 17 కళాశాలల్లో  మొత్తం 930 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు..

➤ కౌన్సెలింగ్ నోటిఫికేషన్: 24.07.2024.

➤ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ పేమెంట్, వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్ల అప్‌లోడ్: 05.08.2024 - 20.08.2024.

➤ స్పెషల్ కేటగిరి (CAP / NCC) అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన: 07.08.2024 - 10.08.2024.

➤ కౌన్సెలింగ్‌ అర్హుల జాబితా ప్రకటన: 21.08.2024.

➤ మొదటి విడత వెబ్‌ఆప్షన్ల నమోదు: 22.08.2024 - 23.08.2024.

➤ వెబ్‌ఆప్షన్ల సవరణకు అవకాశం: 24.08.2024.

➤ సీట్ల కేటాయింపు: 27.08.2024.

➤ సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: 28.08.2024 - 30.08.2024.

Counselling Notification

Counselling Website


TG LAWCET: లాసెట్ అభ్యర్థులకు అలర్ట్ - కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది, రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే?

రాష్ట్రంలో ఈ ఏడాది లాసెట్/పీజీఎల్‌సెట్ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ జూన్‌ 3న నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించింది. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్షలు జరిగాయి. టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలు తొలి రెండు సెషన్లు కలిపి మొత్తం 68 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణలో 64 కేంద్రాలు, ఏపీలో 4 కేంద్రాలు ఉన్నాయి. ఇక మూడో సెషన్‌ పరీక్షలను మొత్తం 50 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణలో 46 కేంద్రాలను, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ప్రవేశ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50,684 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మూడేళ్ల లా కోర్సు కోసం 36,079 మంది, ఐదేళ్ల లా కోర్సు కోసం 10,197 మంది, ఎల్‌ఎల్‌ఎం పరీక్ష కోసం 4,408 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 50,684 మంది అభ్యర్థులకు గాను.. 40,268 మంది  పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలో మొత్తం 79.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget