అన్వేషించండి

Medical Seats: మెడికల్ కాలేజీల్లో ‘స్థానిక' రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు, ఏమందంటే?

తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో 'స్థానిక' విద్యార్థులకు రిజర్వేషన్ అంశంపై సెప్టెంబరు 11న హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా న్యాయస్థానం సమర్థించింది.

తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో 'స్థానిక' విద్యార్థులకు రిజర్వేషన్ అంశంపై సెప్టెంబరు 11న హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా న్యాయస్థానం సమర్థించింది. కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకేనని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆలిండియా కోటాలో 15 శాతం పోగా మిగిలినవన్నీ తెలంగాణ వారికేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా నెలకొల్పిన 34 వైద్య కళాశాలల్లోని 8,215 సీట్లలో ఆలిండియా రిజర్వేషన్‌ 15 శాతం, స్థానికులైన తెలంగాణ విద్యార్థులకు 85 శాతం సీట్లు తెలంగాణ వారికేనని అందులో స్పష్టం చేసింది. ఈ మేరకు జీవో 72ను సవాల్ చేస్తూ పలువురు ఏపీ విద్యార్థులు పిటిషన్ వేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. ఏపీ విద్యార్థుల పిటిషన్‌లను కొట్టివేసింది.

ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లను ఏపీకి చెందిన విద్యార్థులకు ఇవ్వరాదనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. తెలంగాణ నిర్ణయంతో ఏపీ స్టూడెంట్లు నష్టపోతారని పేర్కొంటూ, తమ పిటిషన్​ను విచారణ చేయాలంటూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్​ను కోర్టు విచారించింది. వెద్య కళాశాలల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని వంద శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ వైద్యారోగ్యశాఖ ఇచ్చిన జీవో 72ను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కొత్తగా పెట్టిన వైద్య కళాశాలల్లోని సీట్లలో అన్‌రిజర్వ్‌డ్‌ కోటాను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనకు ముందుకు ఉన్న కళాశాలల సీట్లకు మాత్రమే అన్‌ రిజర్వ్‌డ్‌ కోటా పరిమితం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, ఆర్టికల్‌ 371డి నిబంధనలకు లోబడి తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కాలేజెస్‌ అడ్మిషన్‌ నిబంధనల్లో ప్రభుత్వం సవరణ చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ ఇటీవల జారీ చేశారు. దీని ప్రకారం 2014 జూన్‌ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వ/ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని కాంపిటేటివ్‌ అథారిటీ (కన్వీనర్‌) కోటాలోని సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే చెందుతాయి. ఇన్నాళ్లూ ఈ కాలేజీల్లోని 85శాతం సీట్లే స్థానిక విద్యార్థులకు ఉండగా మిగిలిన 15శాతం అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీలో ఉండేవి. వీటికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు పోటీపడేవారు. తాజా సవరణతో కన్వీనర్‌ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి.

ఏపీలోనూ స్థానికులకే..
రాష్ట్ర విభజన జరిగిన (2014 జూన్ 2) తర్వాత ఏపీలో ఏర్పడ్డ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అన్-రిజర్వుడ్(స్థానికేతర) సీట్లను ఏపీ విద్యార్థులతోనే భర్తీచేసే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏసీఆర్, పద్మావతి, గాయత్రీ, నిమ్రా, బాలాజీ, విశ్వభారతి, అపోలో కళాశాలల్లో, ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా వచ్చిన మచిలీపట్నం, విజయనగరం, నంద్యాల, రాజమహేంద్రవరం, ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోని అన్ని సీట్లను రాష్ట్ర విద్యార్థులతో భర్తీచేసేలా ఉత్తర్వులు రానున్నాయి. దీనివల్ల సుమారు 200 ఎంబీబీఎస్ సీట్లు స్థానిక కోటాలో అదనంగా వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం విభజన తర్వాత ఏర్పాటైన వైద్య కళాశాలల్లోని అన్ని సీట్లను తమ రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోనికి వస్తుందని కూడా వెల్లడించింది. దీంతో ఏపీ విద్యార్థులు తెలంగాణలో అన్ రిజర్వుడ్ కోటాలో సీట్లు పొందే అవకాశాన్ని కోల్పోయారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget