Heavy Rains in Telangana: విద్యార్థులకు అలర్ట్, భారీ వర్షాల కారణంగా సెలవులు పొడిగించిన ప్రభుత్వం!
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీలో జులై 21, 22 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీలో జులై 21, 22 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శనివారాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రైవేటు విద్యా సంస్థలను సైతం మూసివేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
రెండ్రోజులు అన్ని ఆఫీసులకి సెలవులు, వీటికి మినహాయింపు - ఆగని వర్షాల వల్ల సీఎం కేసీఆర్ ఆదేశాలు
మూడు రోజులుగా ఎడ తెరిపిలేని వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల విద్యాసంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు, ఎల్లుండి (జూలై 21, 22) రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. అత్యవసర సేవలు అయిన వైద్యం, పాల సరఫరా లాంటివి కొనసాగుతాయని సీఎం తెలిపారు. అదే సందర్భంలో ప్రయివేట్ సంస్థలు కూడా వారి వారి కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులుగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారిపోయాయి. కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కరఘాట్ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో ఈ రెండు నదులు ప్రవహిస్తున్నాయి. ఈక్రమంలోనే మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజీ 57 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 4,85,030 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లక్ష్మీ బ్యారేజీ ఇన్ ఫ్లో 4,38,880 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 4,85,030 క్యూసెక్కులు ఉంది. భద్రాచలం వద్ద కూడా గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే ఇక్కడ నీటిమట్టం 40 అడుగులకు చేరుకుంది. 43 అడుగులకు చేరితే మొది ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
Related Articles:
తీరిగ్గా నిద్రలేచి సెలవులిచ్చిన విద్యాశాఖ మంత్రికి థాంక్స్ - తెలంగాణలో ఏకిపారేస్తున్న నెటిజన్లు
రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజే (జూలై 20) తెలంగాణ సర్కారు వర్షాల నేపథ్యంలో విద్యాలయాలకు రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే, పిల్లలు బడికి వెళ్లకముందే ఈ సెలవులు ప్రకటిస్తే బాగుండేది. కానీ పిల్లలంతా బడికి వెళ్లిపోయాక సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతటి వర్షంలోనూ చాలా మంది పిల్లలు బడికి వెళ్లారు. మళ్లీ అదే వర్షంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
భద్రాచలం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి - మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు అధికారులు. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కురవడంతో వరదలు పెరిగాయి. దీని వల్ల నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. అయితే భారీ వరదల వల్ల నీటిమ్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలతో సీతారమస్వామి ఆలయ పరిసరాల్లోకి కూడా వర్షం నీరు చేరింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..