DASARA Holidays: తెలంగాణలో దసరా, బతుకమ్మ సెలవులు, మొత్తం ఎన్ని రోజులంటే? ఏపీలో సెలవులు ఇలా!
తెలంగాణ ప్రజలు ఈ ఏడాది అక్టోబర్ 24న దసరా పండగ జరుపుకోనున్నారు. అక్టోబర్ 22న దుర్గాష్టమి అంటే.. ఆరోజు పెద్ద బతుకమ్మ పండగ జరగనుంది. మొత్తం 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి.
![DASARA Holidays: తెలంగాణలో దసరా, బతుకమ్మ సెలవులు, మొత్తం ఎన్ని రోజులంటే? ఏపీలో సెలవులు ఇలా! telangana dussehra and bathukamma festival holidays this year DASARA Holidays: తెలంగాణలో దసరా, బతుకమ్మ సెలవులు, మొత్తం ఎన్ని రోజులంటే? ఏపీలో సెలవులు ఇలా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/e0a43f0f3550553cae30497dba3518861696132223203522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణలో అన్ని పండగల్లో అత్యంత ముఖ్యమైన పండగ దసరా. ఈ పండగకు ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంతూళ్లకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి దసరాను జరుపుకుంటారు. దసరాతో పాటు బతుకమ్మను అంతేఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ముందుగానే సెలవు ప్రకటిస్తుంది. తెలంగాణ ప్రజలు ఈ ఏడాది అక్టోబర్ 24న దసరా పండగ జరుపుకోనున్నారు. అక్టోబర్ 22న దుర్గాష్టమి అంటే.. ఆరోజు పెద్ద బతుకమ్మ పండగ జరగనుంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు ముందుగానే ప్రభుత్వం సెలవు మంజూరు చేస్తుంది.
రాష్ట్రంలో ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ ముందుగానే ప్రకటించింది. తెలంగాణలో దసరా సెలవులు 2022లో 14 రోజులు ఉండగా..2023లో మాత్రం 13 రోజులే ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకు బతుకమ్మ, దసరా సెలవులు ఉండనున్నాయి. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తెరుచుకోనున్నాయి. తెలంగాణలో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ సెలవుల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ పొందిపరిచింది.
తెలంగాణలో పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ వివరాలు ఇలా..
ఏపీలోనూ 13 రోజుల దసరా సెలవులే..?
ఏపీలో ఈఏడాది 12 రోజులపాటు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు 13 నుంచి 25 వరకు దసరా సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. అక్టోబరు 5 నుంచి 11 వరకు ఎస్ఏ-1 పరీక్షలు నిర్వహించి తదనంతరం సెలువులు ఇవ్వనున్నారు. 8వ తరగతి విద్యార్థులకు మినహా.. మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఉదయం పూటే పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబరు 25 వరకు సెలవులు కొనసాగగా.. అక్టోబరు 26 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు షెడ్యూలును ఏపీ విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. అయితే అకడమిక్ క్యాలెండర్‌లో మాత్రం అక్టోబరు14 నుంచి 24 వరకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఏపీలో పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ వివరాలు ఇలా..
ALSO READ:
ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు అవకాశం
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థుల కోసం నిర్దేశించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. డిసెంబరు 10న జరిగే పరీక్షకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అర్హులని, రెసిడెన్షియల్ విధానంలో చదువుతున్న వారికి అర్హత లేదని తెలిపారు. ఈసారి తొలిసారిగా ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచుతున్నామని వెల్లడించారు. దానివల్ల స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యే ఎస్టీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి...
అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఆక్టోబరు 3న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి సెప్టెబరు 26న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను సెప్టెంబరు 30న చూసుకోవచ్చని తెలిపారు. ఖాళీల వివరాలను సంబంధిత కళాశాల నోటీస్ బోర్డులో విభాగాలవారీగా అందుబాటులో ఉంచనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)