News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఆక్టోబరు 3న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్‌ చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు.

FOLLOW US: 
Share:

ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఆక్టోబరు 3న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌, ప్రవేశాల కన్వీనర్‌ చదలవాడ నాగరాణి సెప్టెబరు 26న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను సెప్టెంబరు 30న చూసుకోవచ్చని తెలిపారు. ఖాళీల వివరాలను సంబంధిత కళాశాల నోటీస్‌ బోర్డులో విభాగాలవారీగా అందుబాటులో ఉంచనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

స్పాట్‌ అడ్మిషన్‌ కోరువారు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పాలిసెట్‌ ప్రవేశపరీక్ష రాయకపోయినా, రాసినప్పటికీ ర్యాంకు రాకపోయిన వారుసైతం స్పాట్ ప్రవేశాల్లో సీటు పొందవచ్చని నాగరాణి తెలిపారు. అక్టోబరు 3న మాత్రమే స్పాట్ ప్రవేశాలకు సంబంధించిన మొత్తం ప్రక్రియ ముగుస్తుందని, ఆసక్తి ఉన్న అభ్యర్దులు తమ ఒరిజినల్‌ ధృవీకరణ ప్రతాలతో హాజరు కావాలని ఆమె తెలిపారు. ప్రవేటు పాలిటెక్నిక్‌ లలో ప్రవేశాలకు రూ.25,000, ప్రభుత్వ పాలిటెక్నిక్‌‌లలో రూ.4,700 ఫీజును సైతం అదే రోజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇదే చివరి అవకాశమని పదోతరగతి ఉతీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కన్వీనర్‌ సూచించారు. స్పాట్‌ అడ్మిషన్‌‌లో సీటు పొందిన విద్యార్థులు తక్షణమే తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. మరింత సమగ్ర సమాచారం కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల కార్యాలయాలను సంప్రదించవచ్చని ఆమె పేర్కొన్నారు.

ALSO READ:

'నిమ్స్‌'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 2023 విద్యా సంవత్సరానికి మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ(ఎంపీటీ) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 7లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్‌ ఆప్షన్లు
ఏపీలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబరు 27 నుంచి వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పంచారు. విద్యార్థులు సెప్టెంబ‌రు 27 నుంచి 30 వరకు మొదటి విడత వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్స ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 5 నుంచి 7 వరకు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. యూనివర్సిటీ పరిధిలో బీఎస్సీ అగ్రికల్చర్‌లో 1062 సీట్లు, బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో 55 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 26 Sep 2023 10:03 PM (IST) Tags: ap polycet admissions Education News in Telugu AP Polycet 2023 Counselling AP POLYCET 2023 Spot Admissions

ఇవి కూడా చూడండి

CLAT Answer Key: క్లాట్-2024 ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

CLAT Answer Key: క్లాట్-2024 ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

JEE Main 2024: జేఈఈ మెయిన్-2024 తొలిదశకు 12.30 లక్షల దరఖాస్తులు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నంటే?

JEE Main 2024: జేఈఈ మెయిన్-2024 తొలిదశకు 12.30 లక్షల దరఖాస్తులు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నంటే?

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం