అన్వేషించండి

Telangana Budget 2023: బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రాధాన్యం, రూ.19,093 కోట్లు కేటాయింపు!

ఈ సారి బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక ప్రాధ్యాన్యమిచ్చారు. బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.19,093 కోట్లు కేటాయించారు.రాష్ట్రంలో గురుకుల విద్యకు పెద్దపీట వేశారని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

తెలంగాణ బడ్జెట్‌ 2023 - 24ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్లతో భారీ బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.37,525 కోట్లు. ఈ సారి బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక ప్రాధ్యాన్యమిచ్చారు. బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.19,093 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా పేద పిల్లలు చదువులో ముందుండాలంటే గురుకుల విద్య ద్వారానే సాధ్యమని విశ్వసించిన సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలో గురుకుల విద్యకు పెద్దపీట వేశారని ఆర్థిక మంత్రి హరీశ్‌వారు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 

కేటాయింపులు ఇలా..

➥ రాష్ట్రం ఏర్పడినప్పుడు 293గా ఉన్న గురుకులాలను ఇప్పుడు 1,002కు పెంచామన్నారు. ఆనాడు వసతుల లేమితో 1.31 లక్షల మంది విద్యార్థులు గురుకులాల్లో చదివేవారు. ఇప్పుడు సకల వసతులతో 5.59 లక్షల మంది విద్యార్థులు గురుకుల విద్యను అభ్యసిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో గురుకులాలకు బడ్జెట్‌ కేటాయింపులు రూ.784 కోట్లు ఉండగా.. 2022-23 బడ్జెట్‌ నాటికి అది 3,400 కోట్లకు పెరిగిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
 
➥ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగు కోసం ప్రభుత్వం మన ఊరు మన బడి అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 26,065 పాఠశాలల్లో దశల వారీగా మూడు దశల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చనున్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.7,289 కోట్ల నిధులను కేటాయించారు. మొదటి దశలో భాగంగా రూ.3,497 కోట్ల నిధులతో 9,123 పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. 

➥ యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన, హాస్టల్‌ భవనాల ఆధునీకరణ, కొత్త భవనాల నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లను కేటాయించారు. అదేవిధంగా విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించడం కోసం రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇచ్చారు. ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులకు ఎంసెట్‌, నీట్‌, జేఈఈ తదితర ప్రవేశపరీక్షల కోసం ప్రభుత్వం శిక్షణ ఇస్తున్నది. రాష్ట్రంలో సాంకేతిక విద్యకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత ఎనిమిదిన్నర ఏండ్లలో కొత్తగా 14 పాలిటెక్నిక్‌ కళాశాలలను ఏర్పాటు చేసింది. ఈ విద్యాసంవత్సరం మహేశ్వరం, మణుగూరులో పాలిటెక్నిక్‌ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. జేఎన్టీయూ పరిధిలో ప్రభుత్వం 4 కొత్త ఇంజినీరింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నది.

➥ మహిళా యూనివర్సిటీకి 100 కోట్లు, ఉన్నతవిద్యకు 3001 కోట్లు, ఫారెస్ట్ కాలేజీ కోసం 100 కోట్లు కేటాయించారు.

➥ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల కోసం ప్రభుత్వం సన్నబియ్యంతో భోజనం పెడుతున్నది. రాష్ట్రంలోని 28,606 పాఠశాలలకు చెందిన 25.26 లక్షల మంది విద్యార్థులతోపాటు, 4,237 హాస్టళ్లు, ఇతర విద్యాసంస్థలకు చెందిన 9.77 లక్షల మంది విద్యార్థులకు ఈ సన్నబియ్యం భోజనం అందిస్తున్నారు. దీని కోసం ప్రతి నెల 21,868 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యాన్ని, పోర్టిఫైడ్ రైస్‌ను సరఫరా చేస్తున్నారు. ఇక పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పథకం కింద వంటలు చేసేవారి పారితోషికాన్ని ప్రభుత్వం రూ.1000 నుంచి రూ.3000లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా, రాష్ట్రంలో విద్యా వికాసం కోసం వివిధ శాఖల ద్వారా కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నది.

Also Read:

➥ తెలంగాణ బడ్జెట్‌: శాఖలు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు ఇవీ, దీనికి అత్యధికంగా నిధులు

బడ్జెట్‌లో రైతులకు బిగ్ గుడ్‌న్యూస్! భారీగా నిధులు - రుణమాఫీకి కూడా

➥ 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ 2023-24

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
Naga Chaitanya - Sobhita : ఇఫీ వేడుకల్లో నాగచైతన్య - శోభిత సందడి, రెడ్ కార్పెట్ పై ఫోటోలకు ఫోజులు
ఇఫీ వేడుకల్లో నాగచైతన్య - శోభిత సందడి, రెడ్ కార్పెట్ పై ఫోటోలకు ఫోజులు
Embed widget