Tabs to Teachers: టీచర్లకు షాకిచ్చిన సర్కారు, కేంద్రం ఇవ్వమంది 35 వేలు, రాష్ట్రం ఇచ్చేది 20 వేల ట్యాబ్‌లే!
రాష్ట్రంలోని 17,810 ప్రాథమిక పాఠశాలల్లోని 34,257 మందికి సమగ్ర శిక్షా అభియాన్ కింద ట్యాబ్‌లను అందించాలని చెప్పింది కేంద్రం. రాష్ట్రప్రభుత్వం మాత్రం 20 వేల మందికి మాత్రమే ట్యాబ్‌లను అందజేయనుంది.
తెలంగాణలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్‌జీటీ)కు రాష్ట్రప్రభుత్వం షాకిచ్చింది. కేంద్రం 34,257 మంది టీచర్లకు ట్యాబ్‌లు అందించేందుకు ఆమోదం తెలిపినా.. రాష్ట్రప్రభుత్వం మాత్రం 20 వేల మందికి మాత్రమే ట్యాబ్‌లను అందజేయనుంది. అంటే 14,257 ట్యాబ్‌లకు కోత పెట్టింది.
రాష్ట్రంలోని 17,810 ప్రాథమిక పాఠశాలల్లోని 34,257 మందికి సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) కింద ట్యాబ్‌లను అందించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఒక్కోదానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.34.25 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 60 శాతం వాటాగా ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది .
రాష్ట్ర విద్యాశాఖ ఆలస్యంగా మేల్కొని టెండర్లు పిలిచి వాటి కొనుగోలు బాధ్యతలను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్(టీఎస్‌టీఎస్)కి అప్పగించింది. అదీ 20 వేల ట్యాబ్‌లకు మాత్రమే. ఈ విషయమై విద్యాశాఖ ఉన్నతాధికారిని ప్రశ్నించగా మంచి ట్యాబ్ కావాలంటే రూ.10 వేలకు రావడంలేదన్నారు. అందుకే ధర ఎక్కువైనా అవసరమైన ప్రత్యేకతలన్నీ ఉండేలా చూడాలని ఉన్నతాధికారులు నిర్ణయించారని వెల్లడించారు. అందువల్ల కేటాయించిన నిధులతో 20 వేల ట్యాబ్‌లనే కొంటున్నామని చెప్పారు.
టీచర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, ఈ నెల 27 నుంచి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ స్టార్ట్
టీచర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుందని స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీచర్ల బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. బదిలీలు, పదోన్నతుల పూర్తి షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ముందు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేపట్టనున్నారు. అనంతరం హెచ్‌ఎం ఖాళీలను స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ ఫర్ చేస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు ఇచ్చి స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణలో 2015 జులైలో బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. మరోసారి 2018లో టీచర్ల బదిలీలు చేశారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
23 వేల టీచర్ పోస్టులు ఖాళీ! బదిలీలు, పదోన్నతుల తర్వాత మిగిలిపోయే పోస్టులివే!
తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల తర్వాత భారీగా ఖాళీలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్నవాటితో పాటు ఆ తర్వాత ఏర్పడే ఖాళీలను కలుపుకుని మొత్తం 23 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్‌జీటీలు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 13 వేల వరకు భర్తీ చేయాల్సి ఉందని ప్రకటించింది. అయితే ఇతర శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినా.. టీచర్ పోస్టులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు తరువాత ఎన్ని ఖాళీలు తేలుతాయో పరిశీలించి.. ఆ తరువాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..