News
News
X

TS Teachers Transfers : టీచర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, ఈ నెల 27 నుంచి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ స్టార్ట్

TS Teachers Transfers : టీచర్ల బదిలీలు, పదోన్నతులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 27 నుంచి బదిలీ, పదోన్నతుల ప్రక్రియ చేపట్టనుంది.

FOLLOW US: 
Share:

TS Teachers Transfers : టీచర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుందని స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో టీచర్ల బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. బదిలీలు, పదోన్నతుల పూర్తి షెడ్యూల్‌ వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ముందు గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేపట్టనున్నారు. అనంతరం హెచ్‌ఎం ఖాళీలను స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ ఫర్ చేస్తారు.  సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పదోన్నతులు ఇచ్చి స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణలో 2015 జులైలో బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. మరోసారి 2018లో టీచర్ల బదిలీలు చేశారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.  

మూడేళ్ల మినహాయింపు! 

అయితే పదవీ విరమణకు ఇంకా మూడేళ్ల సర్వీస్‌ మాత్రమే ఉన్నవారిని ఈసారి బదిలీ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండేళ్ల సర్వీస్‌ ఉన్నవారికి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచడంతో ఈసారి మూడేళ్ల సర్వీస్‌ మిగిలి ఉన్నా బదిలీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు బదిలీలను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా, పదోన్నతులను ఆఫ్‌లైన్‌లో నిర్వహించేవారు. అయితే ఈసారి పదోన్నతులను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కేటాయించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.  

నాలుగేళ్ల తర్వాత 

బదిలీలు, పదోన్నతుల కోసం టీచర్లు అనేకమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వినతులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్తూ వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది.  నాలుగున్నరేళ్ల తర్వాత బదిలీలు, పదోన్నతులకు ఓకే చెప్పింది. ఈ బదిలీలకు విద్యాశాఖలో దాదాపు 90 వేల మంది టీచర్లు అర్హత సాధిస్తారు. గత నిబంధనల ప్రకారం ఒకచోట ఉపాధ్యాయుడు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. ఈ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుడు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యాయుడు 5 ఏళ్లు మించి ఒకే చోట పనిచేయకూడదు. ఈ గరిష్ట సర్వీసుని పరిగణలోకి తీసుకొని అధికారులు బదిలీలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగులను కేటాయించింది ప్రభుత్వం. ఈ సమయంలో టీచర్లను కూడా ట్రాన్స్ ఫర్ చేసింది. సీనియారిటీ ప్రతిపాదికన ఆప్షన్లు ఇచ్చి ఈ ప్రక్రియ చేపట్టారు. అయితే ఈ విధానంపై  అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్థానికతకు ప్రాధాన్యం లేకుండా కొత్త జిల్లాల కేటాయింపులు జరగడంతో చాలా మంది ఉపాధ్యాయులు సొంత ప్రాంతాలకు దూరంగా వెళ్లాల్సి వచ్చింది. ఉపాధ్యాయులుగా ఉన్న భార్యాభర్తలను చెరో జిల్లాకు కేటాయించడంతో అప్పట్లో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేశారు. కేటాయింపు ప్రక్రియలో సరైన విధానాలు పాటించలేదని విమర్శలు కూడా వచ్చాయి. తాజా  బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో ఈ సమస్యలు పరిష్కరిస్తారని టీచర్లు కోరుకుంటున్నారు. 

Published at : 20 Jan 2023 08:58 PM (IST) Tags: Hyderabad Teachers transfers TS News Minister Sabitha Indra Reddy

సంబంధిత కథనాలు

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, నడిరోడ్డుపై భార్యను కిరాతంగా హత్య చేసిన భర్త

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, నడిరోడ్డుపై భార్యను కిరాతంగా హత్య చేసిన భర్త

KCR Rocks BJP Shock : తమిళిసై నోటి వెంట సర్కార్ విజయాలు - గవర్నర్, కేసీఆర్ మధ్య వివాదాలు సద్దుమణిగినట్లేనా ?

KCR Rocks BJP Shock : తమిళిసై నోటి వెంట సర్కార్ విజయాలు -  గవర్నర్, కేసీఆర్ మధ్య వివాదాలు సద్దుమణిగినట్లేనా ?

Warangal Fire Accident : వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం, స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి 9 షాపులు దగ్ధం

Warangal Fire Accident : వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం, స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి 9 షాపులు దగ్ధం

Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్‌'తో పరీక్షలకు అనుమతి!

Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్‌'తో పరీక్షలకు అనుమతి!

YS Sharmila Padayatra: నెక్కొండ నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిల

YS Sharmila Padayatra: నెక్కొండ నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిల

టాప్ స్టోరీస్

PM Modi: ప్రపంచంలోనే ది బెస్ట్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ సర్వేలో టాప్‌ ర్యాంక్‌

PM Modi: ప్రపంచంలోనే ది బెస్ట్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ సర్వేలో టాప్‌ ర్యాంక్‌

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!