ఏప్రిల్ 12 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు, వేసవి సెలవులు ఎప్పటినుంచంటే?
తెలంగాణలోని పాఠశాలల్లో 1-9 తరగతుల విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2(ఎస్ఏ) పరీక్షల తేదీల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఏప్రిల్ 12 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలోని పాఠశాలల్లో 1-9 తరగతుల విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2(ఎస్ఏ) పరీక్షల తేదీల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్న విధంగా ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఏప్రిల్ 3 - 13 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతుండటంతో మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని తాజాగా విద్యాశాఖ నిర్ణయించింది.
తాజా షెడ్యూలు ప్రకారం 1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే అయినందున వారికి ఏప్రిల్ 17తో ముగుస్తున్నాయి. ఇక 6 నుంచి 9 తరగతుల వారికి ఏప్రిల్ 20 వరకు జరగనున్నాయి. పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 21న వెల్లడించి రికార్డుల్లో పొందుపరచాలని విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్ 24న తల్లిదండ్రులతో పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల పురోభివృద్ధిపై చర్చించాలని, క్యుమిలేటివ్ రికార్డులపై తల్లిదండ్రుల సంతకాలు తీసుకోవాలని ప్రిన్సిపల్స్‌కు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన సూచించారు.
48 రోజుల వేసవి సెలవులు...
ఈ ఏడాది ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు 48 రోజులపాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. మార్చి రెండోవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Also Read:
తెలంగాణ 'మోడల్ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 10న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరు విద్యార్థులు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ-కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సైనిక పాఠశాలను ప్రత్యేకంగా బాలుర కోసం ఏర్పాటుచేశారు. సరైన అర్హతలు గల బాలురు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపికలు ఉంటాయి.
ప్రవేశ ప్రకటన, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..