అన్వేషించండి

SA-1 Exams: ఏపీలో స‌మ్మెటివ్-1 ప‌రీక్షలు వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే

Andhra Pradesh News: ఏపీలో నవంబరు 14 నుంచి ప్రారంభం కావాల్సిన  సమ్మెటివ్‌ అసెస్‌మెంట్(ఎస్ఏ)-1 పరీక్షలను ప్రభుత్వం వాయిదావేసింది. పరీక్షల షెడ్యూలులో మార్పు చేస్తూ ప్రభుత్వం నవంబరు 8న ఆదేశాలు జారీ చేసింది.

Andhra Pradesh Education and Exams News: ఆంధ్రప్రదేశ్‌లో నవంబరు 14 నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మెటివ్‌ అసెస్‌మెంట్(ఎస్ఏ)-1 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. పరీక్షల షెడ్యూలులో మార్పు చేస్తూ ప్రభుత్వం నవంబరు 8న ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. నవంబరు 14 నుంచి జరగాల్సిన పరీక్షలను నవంబరు 24 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపింది. నవంబరు 24 నుంచి డిసెంబరు 6 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

షెడ్యూలులో భాగంగా.. నవంబరు 24, 25 తేదీల్లో పదోతరగతి కాంపోజిట్‌ తెలుగు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక అన్ని తరగతులవారికి నవంబరు 28 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌, స్మార్ట్‌ టీవీలు ఉన్నచోట మాత్రమే టోఫెల్‌ పరీక్ష ఉంటుంది. సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన వెయ్యి పాఠశాలల 8, 9 తరగతులకు కూడా నవంబరు 28 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.

నవంబరు 10 వరకు ఫీజు చెల్లించే అవకాశం..
ఏపీలో పదోతరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు నవంబర్ 10తో ముగియనుంది. అయితే రూ.50 ఆలస్యరుసుముతో నవంబరు 11 నుంచి 16 వరకు, రూ.200 ఆలస్యరుసుముతో నవంబరు 17 నుంచి 22 వరకు, రూ.500 ఆలస్యరుసుముతో నవంబరు 23 నుంచి 30 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టంచేశారు. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 31.08.2023 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఫీజు చెల్లింపు తేదీలు..

➥ రూ.50 ఆలస్యరుసుముతో నవంబరు 11 నుంచి 16 వరకు 

➥ రూ.200 ఆలస్యరుసుముతో నవంబరు 17 నుంచి 22 వరకు.

➥  రూ.500 ఆలస్యరుసుముతో నవంబరు 23 నుంచి 30 వరకు. 

ఫీజు చెల్లింపు వివరాలు..

➥ 6 సబ్జెక్టులకు రాయాలనుకునే వారు రూ.125 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.

➥ 3 సబ్జెక్టుల వరకు రాయాలనుకునే వారు రూ.110 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.

➥ 6 సబ్జెక్టులకు రాయాలనుకునే వారు రూ.125 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.

➥ ప్రైవేటు విద్యార్థులు హాజరు మినహాయింపు కోసం అదనంగా రూ.650 చెల్లించాల్సి ఉంటుంది.

➥ మూగు, చెవుడు, అంధ విద్యార్థులకు పరీక్ష ఫీజు, హాజరు మినహాయింపు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 40 శాతం పైగా ప్రభావం ఉన్నవాళ్లను దివ్యాంగుల కేటగిరీ పరిగణిస్తారు.

➥ మూగ, చెవుడు విద్యార్థులకు రెండు భాషా సబ్జెక్టుల నుంచి మినహాయింపు ఉంది. అంధ అభ్యర్థులు స్క్రైబ్ తీసుకోవడానికి అర్హులు.

➥ లాంగ్వే్జ్ సబ్జెక్టుల నుంచి మినహాయింపు కోరే దివ్యాంగ విద్యార్థులు ముందుగా ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు..
ఈ ఏడాది కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్కృతం పేపర్లను యథావిధిగా కొనసాగించనున్నారు. ఇదే విధానాన్ని ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్, ఉర్దూ/పార్శి పేపర్లకు అమలు చేయనుంది. మొదట కాంపోజిట్ పేపర్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం మధ్యలో మార్పు చేయడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వచ్చే సంవత్సరం నుంచి తొలగించాలని నిర్ణయించింది. కాంపోజిట్ తెలుగు 70 మార్కులు, కాంపోజిట్ సంస్కృతం 30 మార్కులకు ఉంటుంది. 

ఏడు పేపర్లతోనే పరీక్ష..
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలను గతేడాది ఆరు పేపర్లతో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నుంచి ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం 50 మార్కులకు మరో పేపర్‌గా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లే. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లు యథావిధిగా ఉంటాయి. 

ప్రశ్నపత్రాల్లో మార్పులు..

తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అవుతుండటంతో ప్రశ్నపత్రం విధానంలో మార్పు చేశారు. 

➥ తెలుగు ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించారు. దీని స్థానంలో ఒక పద్యం ఇచ్చి దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి రెండు చొప్పున 8 మార్కులు ఉంటాయి.

➥ రెండో ప్రశ్నగా ఇప్పటి వరకు పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులు ఉండగా.. ఇప్పుడు గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున మార్కులు ఉంటాయి.

➥ హిందీలో విద్యార్థులు తేలికగా ఉత్తీర్ణులయ్యేలా ప్రశ్నపత్రాన్ని మార్చేశారు. గతంలో బిట్ పేపర్‌ను తొలగించగా.. ఇప్పుడు అదేవిధానాన్ని తీసుకొచ్చారు. 14 ఒక మార్కు ప్రశ్నలు, 19 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో బహుళైచ్ఛిక ప్రశ్నలే అధికం.

మోడల్ పేపర్లు, బ్లూప్రింట్ కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Azharuddin: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
Alert for train passengers: రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ -  తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ - తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
New districts in AP: ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది  దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
Baahubali The Epic : 'బాహుబలి ది ఎపిక్' కోసం లేపేసిన సాంగ్స్, సీన్స్ ఇవే - ఆ సీన్ వెరీ డిఫికల్ట్ అన్న రాజమౌళి
'బాహుబలి ది ఎపిక్' కోసం లేపేసిన సాంగ్స్, సీన్స్ ఇవే - ఆ సీన్ వెరీ డిఫికల్ట్ అన్న రాజమౌళి
Advertisement

వీడియోలు

Hurricane Melissa batters Jamaica | జ‌మైకాను నాశనం చేసిన మెలిసా హరికేన్ | ABP Desam
US Airforce Records Inside Hurricane Melissa | హరికేన్ మెలిస్సా ఎంత ఉద్ధృతంగా ఉందో చూడండి | ABP Desam
Cyclone Montha Landfall | తీరం దాటిన మొంథా తుఫాన్
What is Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ ? | ABP Desam
India vs Australia Playing 11 | టీ20 మ్యాచ్ కు భారత్ ప్లేయింగ్ 11 ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Azharuddin: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
Alert for train passengers: రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ -  తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ - తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
New districts in AP: ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది  దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
Baahubali The Epic : 'బాహుబలి ది ఎపిక్' కోసం లేపేసిన సాంగ్స్, సీన్స్ ఇవే - ఆ సీన్ వెరీ డిఫికల్ట్ అన్న రాజమౌళి
'బాహుబలి ది ఎపిక్' కోసం లేపేసిన సాంగ్స్, సీన్స్ ఇవే - ఆ సీన్ వెరీ డిఫికల్ట్ అన్న రాజమౌళి
Komatireddy Venkata Reddy: సినిమాటోగ్రఫీ మంత్రి లేకుండానే సినీ కార్మికుల అభినందన సభ - సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి అసంతృప్తి ?
సినిమాటోగ్రఫీ మంత్రి లేకుండానే సినీ కార్మికుల అభినందన సభ - సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి అసంతృప్తి ?
Kotha Lokah OTT: ఓటీటీలోకి కల్యాణీ ప్రియదర్శన్ 'కొత్త లోక'... టోటల్ థియేట్రికల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
ఓటీటీలోకి కల్యాణీ ప్రియదర్శన్ 'కొత్త లోక'... టోటల్ థియేట్రికల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Mass Jathara : చిరు, విజయశాంతి కాంబో గుర్తొస్తుంది - ఫ్యాన్స్‌కు 'మాస్ జాతర' ఓ సెలబ్రేషన్... డైరెక్టర్ భాను లేటెస్ట్ ఇంటర్వ్యూ
చిరు, విజయశాంతి కాంబో గుర్తొస్తుంది - ఫ్యాన్స్‌కు 'మాస్ జాతర' ఓ సెలబ్రేషన్... డైరెక్టర్ భాను లేటెస్ట్ ఇంటర్వ్యూ
IND vs AUS 1st T20 Highlights:వర్షం కారణంగా ఇండియా ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్‌ రద్దు - ఈ మ్యాచ్‌తో మరో ఫీట్ అందుకున్న సూర్యాభాయ్
వర్షం కారణంగా ఇండియా ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్‌ రద్దు - ఈ మ్యాచ్‌తో మరో ఫీట్ అందుకున్న సూర్యాభాయ్
Embed widget