AP SSC Result 2021: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... పదో తరగతి విద్యార్థులకు ఇకపై మార్కులే... గ్రేడింగ్ విధానానికి స్వస్తి
ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పంది. గ్రేడింగ్ విధానాన్ని తొలగించి మళ్లీ మార్కులు విధానాన్ని తీసుకొచ్చింది. గత విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 10వ తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లకు స్వస్తి చెప్పంది. గ్రేడ్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో తీసుకొచ్చిన గ్రేడింగ్ విధానానికి స్వస్తిచెప్పారు. ప్రవేశాలు, నియామకాల్లో ప్రతిభను గుర్తించేందుకు 2020 నుంచి మార్కులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఒకే గ్రేడ్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు ప్రవేశాలు, నియామకాల్లో సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. దీంతో గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వాలన్న ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపింది. 2019 మార్చి వరకు విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఇచ్చి, 2020 మార్చి నుంచి మార్కులు కేటాయిస్తారు. కరోనా వల్ల గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండా విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించారు.
ఇంటర్ అడ్మిషన్ల కోసం
ఈ విద్యాసంవత్సరం ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 10వ తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల వల్ల సీట్ల కేటాయింపుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి మార్కులను తీసుకొని, ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావించింది. విద్యార్థులకు మార్కులు ఇవ్వకుండా ఇంటర్ విద్యామండలికి ఇస్తే న్యాయ వివాదాలు వస్తాయని పరీక్షల విభాగం అభిప్రాయపడింది. దీంతో ప్రభుత్వం పునరాలోచించి గ్రేడింగ్ వ్యవస్థను రద్దుచేసింది. గ్రేడింగ్ స్థానంలో మార్కుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 10 మార్కుల వ్యత్యాసం ఉన్నా.. విద్యార్థులకు ఒకే గ్రేడ్ వస్తుంది.
Also Read: Wedding Reception: పెళ్లి భోజనానికి రాలేదని గెస్ట్‌కు బిల్లు పంపిస్తారా?.. ఇదెక్కడి పెళ్లిరా బాబు!
జీవో 55 విడుదల
టెన్త్ లో గ్రేడ్‌లకు బదులుగా మార్కులు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీవో 55ని విడుదల చేసింది. 2019-2020 విద్యాసంవత్సరం నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం గ్రేడింగ్ విధానాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తున్నారు. గ్రేడింగ్ విధానం 2018-2019లో నుంచి అమల్లోకి వచ్చింది.
Also Read: Cases On AP Govt : ఏపీ ప్రభుత్వంపై కేసుల సునామీ .. కోర్టుల్లో పెండింగ్‌లో లక్షా 94వేల పిటిషన్లు ..!