Sri Chaitanya Educational Institutions: శ్రీచైతన్య విద్యా సంస్థల ప్రపంచ రికార్డు - 3 గంటల్లో 600 మ్యాథ్స్ ఫార్ములాలు, టీమ్ వర్క్‌తోనే సాధ్యమైందన్న డైరెక్టర్
Hyderabad News: శ్రీచైతన్య విద్యా సంస్థ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గణితంలో చిన్నారుల ప్రతిభా పాటవాలను విశ్వవ్యాప్తం చేసేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది.
Sri Chaitanya Educational Institutions World Record: శ్రీ చైతన్య విద్యా సంస్థ (Sri Chaitanya Educational Institution) వరల్డ్ రికార్డ్ సాధించింది. గణితంలో బాల మేధావుల ప్రతిభా పాటవాలను విశ్వవ్యాప్తం చేసేందుకు సంకల్పించి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UKతో కలిసి పనిచేసింది. నవంబర్ 6న (బుధవారం) దేశంలోని 20 రాష్ట్రాల నుంచి 10,000 మంది బాల ప్రతిభావంతులు పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో 3 - 10 సంవంత్సరాల వయసున్న చిన్నారులు కేవలం 3 గంటల్లో 600 మ్యాథ్స్ ఫార్ములాలు ఏకకాలంలో పఠించి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. దీనిపై శ్రీ చైతన్య విద్య సంస్థల డైరెక్టర్ సీమా బొప్పన ఏబీపీ దేశంతో మాట్లాడారు. టీమ్ వర్క్‌తోనే ఇది సాధ్యమైందని అన్నారు. పిల్లలు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇలాంటి కార్యక్రమంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారని.. తల్లిదండ్రుల వారికి పూర్తి సహకారం అందించారని అన్నారు. 'పిల్లలు చిన్న వయసులోనే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయి. ఈ విజయం అందరి సమిష్టి కృషితోనే సాధ్యమైంది. పిల్లలు, తల్లిదండ్రులు, విద్యా సంస్థల సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు' అని తెలిపారు.
కాగా, 39 ఏళ్ల క్రితం ప్రారంభమైన శ్రీచైతన్య విద్యా సంస్థల ప్రస్థానం సామాన్య విద్యార్థులను సైతం విశ్వవిజేతలుగా తీర్చిదిద్దింది. ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తూ అనేక రికార్డులను సాధించి ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ఇప్పుడు గణితంలో బాల మేధావుల ప్రతిభా పాటవాలతో సత్తా చాటింది. విద్యార్దులకు 100 రోజుల్లో అకుంఠిత దీక్షతో శిక్షణ ఇచ్చి ఈ మహా యజ్ఞానికి సిద్ధం చేశారు. గతంలో కూడా శ్రీచైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల మూడు ప్రత్యేక ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. విద్యార్థులకు ఉత్తమమైన విద్య అందించడం మాత్రమే కాకుండా, శ్రీచైతన్య సాధించబోయే రికార్డులతో విద్యార్థులకు ప్రేరణ కల్పించాలనే లక్ష్యాన్ని కూడా పెట్టుకుంది.
3 ప్రపంచ రికార్డులు
శ్రీచైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల అసాధారణ సామర్థ్యాలను, వినూత్న అభ్యాస విధానాలను ప్రదర్శిస్తూ మూడు ప్రత్యేక ప్రపంచ రికార్డులను నెలకొల్పాయి.
- 2018లో 2.5–5 సంవత్సరాల వయస్సు గల 100 మంది విద్యార్థులు 100 దేశాల మ్యాప్‌లను పఠించి, భౌగోళిక అవగాహనలో అద్భుతమైన ఫీట్ సాధించారు.
- 2022లో 601 మంది విద్యార్థులు 118 అంశాలను పఠించి, 10 రాష్ట్రాల్లో పరమాణు చిహ్నాలతో కూడిన ఆవర్తన పట్టికను ప్రదర్శించారు.
- 2023లో 2,033 మంది విద్యార్థులు 100 నిమిషాల్లో 1 నుంచి 100 వరకు గుణకార పట్టికలను పఠించారు. ఇది శ్రీచైతన్య 100 రోజుల అంకితభావంతో కూడిన శిక్షణకు నిదర్శనం.
ఈ వేదిక శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ ఎక్సలెన్స్‌ను మాత్రమే కాకుండా, విద్యా సాధనలో కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేయడంలో సంస్థ నిబద్ధతను ప్రతిబింబించింది. శ్రీ చైతన్య యాజమాన్యం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు 10,000 మంది విద్యార్థులకు తమ హృదయపూర్వక మద్దతు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పిల్లల విజయం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నారుల్లో ఒత్తిడి లేకుండా మేథస్సును వెలికితీసేందుకు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు.
Also Read: YS Jagan: ఏపీలో చీకటి రోజులు - సూపర్-6 లేదు, సూపర్-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు