అన్వేషించండి

JEE Main 2022: జేఈఈ మెయిన్స్ వాయిదా పడుతుందా? సోషల్ మీడియాలో ఉద్యమం దేనికి?

జేఈఈ మెయిన్‌, సీబీఎస్‌ఈ టెర్మ్‌2 బోర్డ్ పరీక్షలు ఒకేసారి వస్తున్నాయి. ఇది విద్యార్థలను టెన్షన్ పెడుతోంది. అందుకే జేఈఈ మెయిన్స్ పోస్ట్ పోన్ చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్ మెయిన్స్‌ 2022 పరీక్ష ఈ నెలలో నిర్వహించనున్నారు. ఇదే ఇప్పుడు విద్యార్థులను భయపెడుతోంది. సీబీఎస్‌ఈ పరీక్షల టైంలోనే ఈ పరీక్ష కూడా ఉండటంతో విద్యార్థల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. 

సీబీఎస్‌ఈ ఇంటర్‌  రెండో టెర్మ్‌ పరీక్షలను ఏప్రిల్‌ 26 నుంచి జూన్ 15 వరకు జరపనుంది. ఎన్టీఏ కూడా ఏప్రిల్‌ 21 నుంచి మే 4 వరకు జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపైనే విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ రెండు పరీక్షలు ఒకే టైంలో నిర్వహించడంపై సోషల్ మీడియాలో తీవ్రంమైన చర్చ నడుస్తోంది. విద్యాశాఖ మంత్రికి, ఎన్టీఏకు విన్నపాలు చేస్తున్నారు. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ వాయిదా వేయాలని కోరుతున్నారు. 

దీన్ని ఓ ఉద్యమంలా తీసుకెళ్తున్నారు.  దీంతో #PostponeJEEMain2022హ్యాస్‌టాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ రెండు పరీక్షల మధ్య సరిపడా గ్యాపర్ ఉండాలని కోరుతున్నారు విద్యార్థులు. సీబీఎస్‌ఈ, ఎన్టీఏ మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రావాలని సూచిస్తున్నారు. 

ఇలాంటి కీలకమైన పరీక్షలను అధికారులు చాలా క్లిష్టతరం చేస్తున్నారని అందుకే చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. కాస్త ఆలస్యమైతే పరీక్షలకు ఎలాంటి ముప్పు ఉండదని... ఇలా చేస్తే మాత్రం విద్యార్థులు పిచ్చెక్కిపోతారని అంటున్నారు. ఈ టెన్షన్‌లో మార్కులు రాకపోతే చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉందని హెచ్చరించారు విద్యార్థులు. 

ఈ వివాదంపై ఫన్నీ ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. సీరియస్‌గా నడుస్తున్న టాపిక్‌కు హాస్యం జోడించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మరికొందరు విద్యార్థులు. 

జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు సంబందించిన షెడ్యూల్‌ను గత నెలలోనే ఎన్టీఏ విడుదల చేసింది. అది జరిగిన కొన్ని రోజులకే సీబీఎస్‌ఈ పరీక్ష షెడ్యూల్ వచ్చింది. దీంతో ఈ రెండు పరీక్షలపై విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. 

టాప్ హెడ్ లైన్స్

NEET JEE Weightage Changes: NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
NEET UG 2026 Result: నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ఫలితాలు జూలై 20 నాటికి విడుదల! ఎంబిబిఎస్ అడ్మిషన్లు, కొత్త సెషన్స్‌పై కీలక ప్రకటన!
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ఫలితాలు జూలై 20 నాటికి విడుదల! ఎంబిబిఎస్ అడ్మిషన్లు, కొత్త సెషన్స్‌పై కీలక ప్రకటన!
CBSE Parenting Calendar 2026: సీబీఎస్ఈ కొత్త పేరెంటింగ్ క్యాలెండర్‌ విడుదల! 2026-27 విద్యా సంవత్సరంలో వచ్చే మార్పులు ఇవే! 
సీబీఎస్ఈ కొత్త పేరెంటింగ్ క్యాలెండర్‌ విడుదల! 2026-27 విద్యా సంవత్సరంలో వచ్చే మార్పులు ఇవే! 

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Hindu Dharma: హిందూ ధర్మం -
హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?
Vijayawada Sai Krishna Case: సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Embed widget