అన్వేషించండి

TS CPGET 2023: ఆగస్టు 22న సీపీగెట్‌-2023 ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే?

తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)-2023’ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఆగస్టు 22న వెల్లడించనున్నారు.

తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)-2023’ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఆగస్టు 22న వెల్లడించనున్నారు. సీపీగెట్ ఫలితాలను ఆగస్టు 22న మధ్యాహ్నం 3.30గంటలకు హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఓయూ వీసీ డి.రవీందర్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. జూన్ 30 నుంచి జులై 10 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీపీగెట్ పరీక్షలకు మొత్తం 69,439 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 

Website

సీపీగెట్ ద్వారా ఉస్మానియా, కాక‌తీయ‌, పాల‌మూరు, మ‌హాత్మాగాంధీ, శాతవాహ‌న‌, తెలంగాణ‌, జేఎన్టీయూహెచ్, మ‌హిళా వ‌ర్సిటీల్లో ప్రవేశాలు క‌ల్పించ‌నున్నారు. ఈ యూనివర్సిటీల్లోని ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర వంటి సంప్రదాయ కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు. మొత్తం 84 సబ్జెక్టులకు రాష్ట్రంలోని 12 జోన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలోని 320 కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా కళాశాలల్లో మొత్తం 50 కోర్సుల్లో 112 విభాగాలకు విద్యార్థులు ప్రవేశాలు కల్పిస్తారు. 

ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంసీజే, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు.

ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా, కాక‌తీయ‌, పాల‌మూరు, మ‌హాత్మాగాంధీ, శాతవాహ‌న‌, తెలంగాణ‌, జేఎన్టీయూహెచ్, తెలంగాణ మ‌హిళా వ‌ర్సిటీలు సీపీగెట్ పరీక్ష ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.

డిగ్రీ ఏదైనా.. పీజీలో నచ్చిన కోర్సు..

➥ రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది ఇంతే సంఖ్యలో సీట్లున్నా, చేరిన వారి సంఖ్య 22,812 మాత్రమే. వీరిలోనూ 16,163 (71%) మహిళలు, 6,649 (29%) పురుషులు చేశారు.

➥ డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆఖరుకు ఎంబీబీఎస్, బీటెక్‌ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్‌ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్‌ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే.

➥ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కోటాను 5% నుంచి 20%కి పెంచారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్‌ న్యూమరరీ పోస్టులు క్రియేట్‌ చేస్తారు. ఆన్‌లైన్, డిస్టెన్స్‌ మోడ్‌లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. 

ALSO READ:

ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా!
గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) 2023 విద్యా సంవత్సరానికి రెండో సెషన్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ, ఎండీ, ఎంఎస్‌, ఎండీఎస్‌, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో నర్సింగ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా
వరంగల్‌లోని కాళోజీనారాయణరావు హెల్త్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్‌, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్(బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 20 నుంచి ఆగస్టు 31న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించిన తర్వాత మెరిట్‌ జాబితాను ప్రకటించనున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth on Kishan Reddy:  కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth on Kishan Reddy:  కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
EPF Interest Rate: 7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
Uttarakhand : బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
Andhra Pradesh Budget 2025 Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
Meenakshi Natarajan: మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
Embed widget