అన్వేషించండి

Nursing: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో నర్సింగ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా

వరంగల్‌లోని కాళోజీనారాయణరావు హెల్త్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్‌, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

వరంగల్‌లోని కాళోజీనారాయణరావు హెల్త్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్‌, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్(బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 20 నుంచి ఆగస్టు 31న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించిన తర్వాత మెరిట్‌ జాబితాను ప్రకటించనున్నారు.

వివరాలు..

* నర్సింగ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు

1) బీఎస్సీ నర్సింగ్  

కోర్సు వ్యవధి: నాలుగేళ్ల డిగ్రీ కోర్సు.

2) పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్  

కోర్సు వ్యవధి: రెండేళ్లు డిగ్రీ కోర్సు.

అర్హత: ఇంటర్మీడియట్(బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ-బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: టీఎస్ ఎంసెట్ 2023 ర్యాంకు ఆధారంగా.

ఎంసెట్ కటాఫ్ మార్కులు..

➥ జనరల్/ఈడబ్ల్యూఎస్-50 పర్సంటైల్-53257.

➥ ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులు-40 పర్సంటైల్-63908.

➥ దివ్యాంగులు(ఓసీ)-45 పర్సంటైల్-58582.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు  ప్రక్రియ ప్రారంభం: 20.08.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.08.2023.

దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు..

  • టీఎస్ ఎంసెట్-2023 హాల్‌టికెట్
  • టీఎస్ ఎంసెట్-2023 ర్యాంకు కార్డు
  • బర్త్ సర్టిఫికేట్ (టెన్త్ మార్కుల మెమో)
  • ఇంటర్/జీఎన్‌ఎం మార్కుల మెమో
  • 6 - 10వ తరగతులు స్టడీ సర్టిఫికేట్లు
  • ఇంటర్/జీఎన్‌ఎం స్టడీ సర్టిఫికేట్లు
  • రెసిడెన్స్ సర్టిఫికేట్
  • ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్
  • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)
  • క్యాస్ట్ సర్టిఫికేట్
  • తల్లిదండ్రుల ఇన్‌కమ్ సర్టిఫికేట్
  • ఆధార్ కార్డు
  • సర్వీస్ సర్టిఫికేట్
  • పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
  • విద్యార్థి సంతకం

Notification

Online Application

ALSO READ:

జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో కొత్త పీజీ కోర్సు అందుబాటులోకి, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (JNAFAU)లో కొత్త పీజీ (మాస్టర్స్) కోర్సు అందుబాటులోకి వచ్చింది. ఎనర్జీ అండ్‌ సస్టైనబుల్‌ బిల్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ పేరుతో కొత్త మాస్టర్స్‌ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు యూనివర్సిటీ అధికారులు శనివారం నాడు ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ యూనివర్సిటీలో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కోర్సును ప్రవేశపెట్టిన తొలి విద్యాసంస్థ ఇదేనని వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.కవితా దర్యాణిరావు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఈ కోర్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమ, సబ్జెక్ట్‌ నిపుణుల సహకారంతో ఈ కోర్సును రూపొందించబడిందని, కోర్సులో 20 మందికి ప్రవేశాలను కల్పించనున్నట్లు తెలిపారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో పార్ట్ టైమ్ కోర్సులు, ప్రవేశాలు ఇలా!
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి గాను వివిధ పార్ట్ టైమ్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష/ ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP DesamSunita Williams Crew 9 Dragon Capsule Splash Down | భూమిపైకి క్షేమంగా సునీతా విలియమ్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Sunita Williams : 'మా మనసులు గెలుచుకున్నారు': సునీతా విలియమ్స్‌పై మోదీ ప్రశంస 
'మా మనసులు గెలుచుకున్నారు': సునీతా విలియమ్స్‌పై మోదీ ప్రశంస 
Sunita Williams Returns: సునీతమ్మ వచ్చేసిందోచ్‌- సురక్షితంగా అంతరిక్షం నుంచి అమ్మ ఒడికి
సునీతమ్మ వచ్చేసిందోచ్‌- సురక్షితంగా అంతరిక్షం నుంచి అమ్మ ఒడికి
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Betting apps case: బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
Embed widget