Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
Viral Video: మొబైల్ పట్టుకుని డ్రైవింగ్ ఎంత డేంజరో ఈ వీడయో స్పష్టంగా చెబుతుంది. ఓ చెత్తో మొబైల్ ఫోన్ నడుపుతూ , వేగంగా ఓకారును ఓవర్ టేకే చేసేప్పుడు జరిగిన ప్రమాదం సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది. స్కూటీపై నుంచి గాల్లోకి ఎగిరిపడ్డ యువతి వీడియో చూస్తే రోజూ ఎంత మంది ఇలా ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారో అన్న ఆలోచన రాకమానదు. పంజాబ్‌లోని కోట్‌కపూరలో అతివేగం ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. స్కూటీ నడుపుతూ కారును ఓవర్‌టేక్ చేసే క్రమంలో, ఒక చేత్తో మొబైల్ పట్టుకుని ఉండటంతో స్పీడ్ బ్రేకర్ వద్ద బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో స్కూటీ వెనక టైర్ గాల్లోకి లేచి స్కిడ్ అవ్వడంతో ఆమె రోడ్డుపై బలంగా పడిపోయింది. వెనకాల ఉన్న కారు డ్యాష్ క్యామ్‌లో ఈ భయానక దృశ్యాలు రికార్డయ్యాయి. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడటం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ వీడియోను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ స్పీడ్, నిర్లక్ష్యం ఎంత ప్రమాదమో చూడండి. దీని వల్ల మీకేం అర్దమైంది అంటూ అడిగారు. దీనికి నెటిజన్లు కూడా భిన్నంగా స్పందించారు. అతివేగం, మొబైల్ వాడకాన్నిచాలామంది తప్పుపట్టగా.. కొందరు మాత్రం రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు సూచించే మార్కింగ్ లేకపోవడం కాడా అధికార యంత్రాంగం తప్పిదమే అంటూ సూచించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో స్పందించడం కన్నా దీనిపై చర్యలు చేపట్టాలని మరికొందరు సూచించారు.
ట్రెండింగ్ వార్తలు






















