TS SET 2022 Results: టీఎస్ సెట్-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 ఫలితాలు ఏప్రిల్ 25న విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితాల్లో మొత్తం 2,857 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
➥ ఫలితాల్లో 7.11 శాతం మాత్రమే ఉత్తీర్ణత
➥ త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూలు ప్రకటన
తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS SET) - 2022 ఫలితాలు ఏప్రిల్ 25న విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. టీఎస్ సెట్-2023 స్కోరు కార్డును అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి స్కోరు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టీఎస్ సెట్-2022 పరీక్షకు మొత్తం 50,256 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 40,128 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో కేవలం 2,857(7.11 శాతం) మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్ల నెంబర్లను ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. అలాగే సబ్జెక్టులవారీగా అభ్యర్థులు సాధించిన కటాఫ్ మార్కుల వివరాలను, సబ్జెక్టుల వారీగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ సెట్ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఓయూ చూస్తోంది. జనరల్ స్టడీస్, 29 సబ్జెక్టుల్లో సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించారు. ధ్రువపత్రాల పరిశీలన తేదీలను త్వరలో వెల్లడించనున్నారు.
Hall Ticket Nos Selected Candidates
Cut off Sheet- Subject Wise/Category wise
Subject wise- Registered/ Appeared/ Qualified Details
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్)-2022 నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం డిసెంబరు 23న విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిసెంబరు 30 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 13 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహించారు.
సబ్జెక్టులు: మొత్తం 29 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
Also Read:
జేఈఈ మెయిన్ తుది కీ విడుదల, హైదరాబాద్ విద్యార్థి కౌండిన్యకు 'ఫుల్' మార్కులు!
జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్ష తుది కీని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ఏప్రిల్ 24న రాత్రి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఏ ప్రకటించిన ఫైనల్ ఆన్సర్ కీ ప్రకారం హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట్ కౌండిన్యకు 300/300 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్ ఫలితాల్లో మొదటి 10 ర్యాంకుల్లో కౌండిన్య నిలిచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కౌండిన్య పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల్లో చదివాడు. జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతానని కౌండిన్య తెలిపాడు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
డీఈఈసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!
తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2023' (డీఎడ్) నోటిఫికేషన్ ఏప్రిల్ 21న విడుదలైంది. రెండేళ్ల కాలపరిమతితో ఉండే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించి ఏప్రిల్ 22 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..