అన్వేషించండి

JoSAA 2022 Registration: ప్రారంభమైన 'జోసా' రిజిస్ట్రేషన్ ప్రక్రియ, డైరెక్ట్ లింక్ ఇదే!

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక కోసం ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాంభించాల్సి ఉంటుంది.

జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల ప్రక్రియ పూర్తవడంతో.. సంబంధిత కళాశాలల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) సెప్టెంబరు 12న ప్రారంభించింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక కోసం ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాంభించాల్సి ఉంటుంది. 


జోసా' కౌన్సెలింగ్‌లో భాగంగా.. జేఈఈ మెయిన్స్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు సెప్టెంబరు 12 నుంచి తమకు నచ్చిన విద్యాసంస్థలో సీటు కోసం ఆన్‌లైన్‌లో ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని ఆప్షన్లనైనా ఇచ్చుకునే వెసులుబాటు ఉంది. తదనంతరం విద్యార్థుల అవగాహన కోసం మాక్‌ సీటు అలకేషన్‌ను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 18న మొదటి విడత మాక్ సీట్ల కేటాయింపు, సెప్టెంబరు 20న రెండో విడత మాక్ సీట్లను ప్రకటించనున్నారు. సెప్టెంబరు 20తో ఆప్షన్ల నమోదు ప్రకియ ముగియనుంది. సెప్టెంబరు 21 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం 6 రౌండ్లలో కౌన్సెలింగ్‌‌ కొనసాగనుంది. సెప్టెంబరు 23న మొదటి విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. 


జోసా కౌన్సెలింగ్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

JoSAA Online Registration Link


అధికారిక వెబ్‌సైట్


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 6 రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే అక్టోబరు 16 నుంచి 21 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. మరోవైపు సీట్ల భర్తీ నియమ నిబంధనలను కూడా ప్రకటించింది. సీట్లు పొందిన జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.40,000; ఇతరులు రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. అందులో 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 33 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.

JoSAA కౌన్సెలింగ్ ఇలా..

1వ రౌండ్‌ : సెప్టెంబరు 23 నుంచి 27 వరకు

2వ రౌండ్‌: సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు

3వ రౌండ్‌: అక్టోబరు 3 నుంచి 7 వరకు

4వ రౌండ్‌: అక్టోబరు 8 నుంచి 11 వరకు

5వ రౌండ్‌: అక్టోబరు 12 నుంచి 15 వరకు

6వ రౌండ్‌ (చివరి): అక్టోబరు 16 నుంచి 17 వరకు నిర్వహిస్తారు. 

6 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవే:

1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 23న

2వ రౌండ్‌: సెప్టెంబరు 28న

3వ రౌండ్‌: అక్టోబరు 3న

4వ రౌండ్‌: అక్టోబరు 8న

5వ రౌండ్‌: అక్టోబరు 12న

6వ రౌండ్‌ (చివరి): అక్టోబరు 16న

 

Also Read:

APOSS Admissions: ఏపీ సార్వత్రిక విద్యాపీఠంలో పదోతరగతి, ఇంటర్ ప్రవేశాలు
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ 2022-23 విద్యా సంవత్సరానికి పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. చదువుకోవాలని కోరిక వుండి వివిధ కారణాల వల్ల చదువు కొనసాగించలేనివారి కోసం ముఖ్యంగా బాలికలు, గ్రామీణ యువత, పనిచేయి స్త్రీ, పురుషులు, ఎస్సీలు, ఎస్టీలు, ప్రత్యేక అవసరాలు గల వారికి  విద్యనందించడమే ఓపెన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

NVS: నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను తొమ్మిదో తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న  650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు. రాతపరీక్ష ఆధాంగా విద్యార్థులను ఎంపికచేస్తారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశప్రకటన, ఎంపిక విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:

AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏడాదిలో రెండు సార్లు దూరవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. 
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs MI Match Highlights IPL 2025 | ముంబై ఇండియన్స్ పై 36 పరుగుల తేడాతో గుజరాత్ విజయం | ABP DesamMS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Hardik Pandya :బూతు పదంతో సాయికిషోర్‌న తిట్టిన హార్దిక పాండ్యా, సోషల్ మీడియాలో వీడియో వైరల్
బూతు పదంతో సాయికిషోర్‌న తిట్టిన హార్దిక పాండ్యా, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Operation Brahma: మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
Hyderabad Metro Latest Timings: మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
US-Canada Tariff War: ట్రంప్ టారిఫ్ విధానంతో అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత!
ట్రంప్ టారిఫ్ విధానంతో అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత!
Embed widget