By: ABP Desam | Updated at : 15 Mar 2023 08:36 AM (IST)
Edited By: omeprakash
నీట్ పీజీ 2023 పరీక్ష ఫలితాలు
దేశవ్యాప్తంగా వైద్య విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) మెడికల్ సీట్ల భర్తీకి నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 5న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. నీట్ పీజీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉన్న ఫలితాలను చూసుకోవచ్చు.
నీట్ పీజీ ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ ఆయన కంగ్రాట్స్ చెప్పారు. నీట్ పీజీ పరీక్షలను మరోసారి విజయవంతంగా నిర్వహించి రికార్డు సమయంలో ఫలితాలను విడుదల చేయడంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అద్భుతంగా పని చేసిందని ప్రశంసించారు. వారి కృషిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. మార్చి 25 నుంచి నీట్ పీజీ స్కోరుకార్డులు అందుబాటులో ఉండనున్నాయి.
కటాఫ్ మార్కులు ఇలా..
అలాగే, 800 మార్కులకుగానూ జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 291 మార్కుల కటాఫ్‌ను ప్రకటించగా, జనరల్-పీడబ్ల్యూబీడీ వారికి 274 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ వారికి 257 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించింది. ఆయా కేటగిరీలవారు నిర్దేశిత మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులవుతారు. కాగా, మార్చి 5న నీట్ పీజీ పరీక్ష జరగ్గా, 2 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
నీట్ పీజీ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
The result of NEET-PG 2023 has been announced today!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 14, 2023
Congrats to all students declared qualified in results.
NBEMS has again done a great job by successfully conducting NEET-PG exams & declaring results in a record time. I appreciate their efforts!
https://t.co/7rZshIOr3p
Also Read:
GATE - 2023 ఫలితాలు వచ్చేస్తున్నాయ్! స్కోరుకార్డులు ఎప్పటినుంచంటే?
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 పరీక్షను ఐఐటీ కాన్పూర్ ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. మార్చి 16న గేట్-2023 ఫలితాలను వెల్లడించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాలు వెల్లడి కాగానే.. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా మార్చి 16న విడుదల చేయనుంది. అయితే గేట్-2023 స్కోరు కార్డులు మాత్రం మార్చి 21 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
ఫలితాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్) అర్హత కోసం 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' పరీక్ష నిర్వహిస్తున్న సంగతి విదితమే. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ఏడాదికి గాను 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 202/ జూన్ 2023' నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు.
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
TS SSC Exams: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ!
JAM 2023 Results: ఐఐటీ జామ్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!
CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల