NCHM JEE-2024: 'హోటల్ మేనేజ్‌మెంట్' కోర్సుతో ఉజ్వల భవిత, నెలకు 4 నుంచి 5 లక్షల వరకు జీతం
హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మూడేళ్ల బీఎస్సీ కోర్సులో ప్రవేశానికి 'NCHM JEE'-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
National Council for Hotel Management Joint Entrance Examination (NCHM JEE)-2024: హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మూడేళ్ల బీఎస్సీ కోర్సులో ప్రవేశానికి 'నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (NCHM JEE)'-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2 నుంచి 5 వరకు దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి దేశవ్యాప్తంగా 109 కేంద్రాల్లో మే 11న కంప్యూటర్ ఆధారిత విధానంలో ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను వారం ముందునుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
వివరాలు..
* బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్)
సీట్ల సంఖ్య: 11,995. మొత్తం సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, జనరల్-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 శాతం సీట్లు కేటాయిస్తారు.
కళాశాలల వివరాలు..
ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈలో స్కోర్ ఆధారంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లోని 78 హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో 11,995 సీట్లకు పోటీపడొచ్చు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో 21 ఇన్‌స్టిట్యూట్‌లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 27 ఇన్‌స్టిట్యూట్‌లు, 29 ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు, ఒక పీఎస్‌యూ ఇన్‌స్టిట్యూట్‌లో బీఎస్సీ హోటల్‌మేనేజ్‌మెంట్ కోర్సు అందుబాటులో ఉంది. వీటన్నింటి పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ సంస్థను కూడా పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. తెలంగాణలో డాక్టర్ వైఎస్‌ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, ఎస్‌ఐహెచ్‌ఎం–మెదక్, సీఐహెచ్‌ఎం –హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐహెచ్‌ఎం–తిరుపతిలలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌లు బీఎస్సీ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్నాయి. వీటితోపాటు పలు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి.
కోర్సులోని అంశాలు..
ఈ ప్రోగ్రామ్‌లో ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్, హౌస్ కీపింగ్, హోటల్ అకౌంటెన్సీ, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఫెసిలిటీ ప్లానింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, టూరిజం మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలు బోధిస్తారు. ల్యాబ్ వర్క్‌లు కూడా ఉంటాయి. అంతే కాకుండా హోటల్ అకౌంటెన్సీ, ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ, హ్యూమన్ రిసోర్సు మేనేజ్‌మెంట్, ఫెసిలిటీ ప్లానింగ్, ఫైనాన్సిల్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ మరియు టూరిజం మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ అంశాల్లో శిక్షణ అందిస్తారు.
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. విద్యార్హత చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: ఎలాంటి వయోపరిమితి లేదు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000; జనరల్-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.700; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థుల రూ.450 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష ఆధారంగా. పరీక్ష సమయం 3 గంటలు.
రాతపరీక్ష విధానం..
➥ మొత్తం 800 మార్కులకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఎబిలిటీ-30 ప్రశ్నలు, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్-30 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్-30 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్-60 ప్రశ్నలు.
➥ ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
➥ హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు: దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
హోటల్ మేనేజ్‌మెంట్.. లభించే కొలువులు..
➥ హోటల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు పూర్తి చేసిన వారికి.. గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్; ఫ్రంట్ డెస్క్ మేనేజర్; క్రూయిజ్ మేనేజర్; కిచెన్ ఎగ్జిక్యూటివ్; మార్కెటింగ్ మేనేజర్; సర్వీస్ ఎగ్జిక్యూటివ్; అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్; ట్రిప్ అడ్వైజర్; బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూటివ్స్; చెఫ్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి.
➥ బీఎస్‌సీ కోర్సులో వీరు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ఆయా విభాగాల్లో ఎంట్రీ లెవల్ కొలువులు దక్కించుకోవచ్చు. ప్రారంభంలో సగటున రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వేతనాన్ని సంస్థలు అందిస్తున్నాయి.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.03.2024 (05.00 PM)
➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 31.03.2024 (11:50 P.M.)
➥ దరఖాస్తుల సవరణ: 02.04.2024 - 05.04.2024.
➥ పరీక్షతేది: 11.05.2024. (09.00 AM to 12.00 PM)