CMAT Admit Card: సీమ్యాట్-2023 అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష వివరాలు ఇలా!
సీమ్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్) అడ్మిట్ కార్డులను మే 1న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. సీమ్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీమ్యాట్ ప్రవేశ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో మే 4న రెండు షిఫ్ట్‌లలో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం..
➥ మొత్తం 400 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 80 మార్కులు కేటాయించారు. ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నల చొప్పున మొత్తం 5 విభాగాల సెనుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు.
➥ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ & డేటా ఇంటర్‌ప్రిటేషన్ 20 ప్రశ్నలు-800 మార్కులు, లాజికల్ రీజనింగ్ 20 ప్రశ్నలు-80 మార్కులు, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 20 ప్రశ్నలు-80 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు-80 మార్కులు, ఇన్నోవేషన్ & ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ 20 ప్రశ్నలు-80 మార్కులు ఉంటాయి.
➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఒక ప్రశ్నకు ఒక సమాధానం మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ జవాబులు గుర్తించిన ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోరు. నెగెటివ్ మార్కులు ఇస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.
సీమ్యాట్ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
విద్యార్థులకు అలర్ట్ - ఆన్‍లైన్‍లో ఇంటర్ మెమోలు, ఇలా డౌన్‍లోడ్ చేసుకోండి!
ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 26న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా మెమోలను అందిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కలర్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మెమోలతో ఉన్నతవిద్యలో ప్రవేశాలు పొందవచ్చని ఇంటర్ బోర్డు సూచించింది. ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు విడుదలైన రోజు విద్యార్థుల మార్కుల జాబితాలను మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. తాజాగా మెమోలను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇంటర్ మెమోల కోసం క్లిక్ చేయండి..
ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈసారి ఎన్ని సెలవులంటే?
ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌కి 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, అలాగే వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అదేవిధంగా మార్చి 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..