విద్యార్థులకు అలర్ట్ - ఆన్‍లైన్‍లో ఇంటర్ మెమోలు, ఇలా డౌన్‍లోడ్ చేసుకోండి!
ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 26న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా మెమోలను అందిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డ్ తెలిపింది.
ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 26న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా మెమోలను అందిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కలర్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మెమోలతో ఉన్నతవిద్యలో ప్రవేశాలు పొందవచ్చని ఇంటర్ బోర్డు సూచించింది. ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు విడుదలైన రోజు విద్యార్థుల మార్కుల జాబితాలను మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. తాజాగా మెమోలను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇంటర్ మెమోలు ఇలా పొందండి..
➨ ఇంటర్ మెమోల కోసం విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.-https://bieap.apcfss.in/
➨ అక్కడ హోంపేజీ కనిపించే 'STUDENTS' లింక్ మీద క్లిక్ చేయాలి.
➨ దానిపై క్లిక్ చేయగానే వచ్చే పేజీలో 'Migration Certificate' ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
➨ తర్వాత వచ్చే పేజీలో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు, ఈమెయిల్ ఐడీ నమోదుచేసి 'Get Data' ట్యాబ్ మీద క్లిక్ చేయాలి.
➨ విద్యార్థుల ఇంటర్ మెమో కంప్యూటర్ తెరమీద దర్శమిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని కలర్ ప్రింట్ తీసుకోవచ్చు,
ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలతో పాటు ఒకేషనల్ విద్యార్థుల ఫలితాలను సైతం విద్యాశాఖ మంత్రి బొత్స ఏప్రిల్ 26న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఏపీలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్ సెకండియర్ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. వీరిలో 9,20,552 మంది రెగ్యులర్, 83,749 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు.
Also Read:
ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈసారి ఎన్ని సెలవులంటే?
ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌కి 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, అలాగే వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అదేవిధంగా మార్చి 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూలును ఇంటర్‌బోర్డు ఏప్రిల్ 27న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్ధులకు, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..