NEET UG: నీట్ యూజీ-2023 రౌండ్-2 'సీట్ మ్యాట్రిక్స్' వివరాలు వెల్లడి, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
నీట్ యూజీ-2023 రౌండ్ 2 సీట్ మ్యాట్రిక్స్ వివరాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉన్న సీట్ల ఖాళీల వివరాలను చూసుకోవచ్చు.
నీట్ యూజీ-2023 రౌండ్ 2 సీట్ మ్యాట్రిక్స్ వివరాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ విడుదల చేసింది. మొదటి విడతలో సీట్లు పొందలేకపోయిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉన్న సీట్ల ఖాళీల వివరాలను చూసుకోవచ్చు. మొదటి విడత కౌన్సెలింగ్ తర్వాత అదనంగా 500 కొత్త సీట్లను రెండో రౌండ్‌లో కౌన్సెలింగ్‌కు జతచేశారు. రెండో రౌండ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 14తో ముగియనుంది. రిజిస్ట్రేషన్ పూర్తయినవారు ఆగస్టు 15 వరకు ఆప్షన్ల నమోదు, లాకింగ్ ఉంటుంది. ఆగస్టు 16, 17 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టి, ఆగస్టు 18న సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు ఆగస్టు 19న పోర్టల్ ద్వారా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందినవారు ఆగస్టు 20 నుంచి ఆగస్టు 28 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
సీట్ మ్యాట్రిక్స్ వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆగస్టు 31 నుంచి మూడో విడత కౌన్సెలింగ్..
నీట్ యూజీ 2023 రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 31 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 4 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరు సెప్టెంబరు 1 నుంచి 5 వరకు ఆప్షన్ల నమోదు, లాకింగ్ ఉంటుంది. తర్వాత సెప్టెంబరు 6, 7 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టి, సెప్టెంబరు 8న సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు సెప్టెంబరు 9న పోర్టల్ ద్వారా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందినవారు సెప్టెంబరు 10 నుంచి సెప్టెంబరు 18 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
మిగిలిపోయిన సీట్లకు...
మూడువిడతల కౌన్సెలింగ్ అనంతరం మిగిలినపోయిన సీట్లను సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు. సెప్టెంబరు 21 నుంచి 23 మధ్య రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెప్టెంబరు 22 నుంచి 24 మధ్య ఆప్షన్ల నమోదు, లాకింగ్ ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 25న సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టి, సెప్టెంబరు 26న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు సెప్టెంబరు 27 నుంచి సెప్టెంబరు 30 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
టీఎస్ ఐసెట్-2023 కౌన్సెలింగ్ వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!
తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6, 7 తేదీల్లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తదనంతరం సెప్టెంబరు 8 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్లను సెప్టెంబర్ 17న కేటాయించనున్నారు. సెప్టెంబరు 22 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తాంచనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
పీఎం యశస్వి స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం యశస్వి’ స్కాలర్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు పొడిగించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. ఈ మేరకు ఆగస్టు 11న ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఆగస్టు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 30 వేల స్కాలర్‌షిప్స్ కోసం ఎన్‌టీఏ యశస్వి (యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డు స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా) పరీక్ష-2023 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..