NEET PG 2022 Scorecard: నీట్ పీజీ 2022 స్కోర్ కార్డ్స్ ఇలా సింపుల్‌గా Download చేసుకోండి, Cutoff కూడా తెలుసుకోవచ్చు
NEET PG 2022 Scorecard Download: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) నిర్వహించిన నీట్ పీజీ 2022 పరీక్షా ఫలితాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేయగా, నేటి నుంచి స్కోర్ కార్డులు రానున్నాయి.
NEET PG 2022 Scorecard available at nbe.edu.in: మెడికల్ పీజీ కోర్సుల కోసం నిర్వహించిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) నిర్వహించిన నీట్ పీజీ 2022 పరీక్షా ఫలితాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఈ ఫలితాలను natboard.edu.in ఈ వెబ్ సైట్‌లో చూసుకోవాలని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. అయితే నేడు నీట్ పీజీ అభ్యర్థుల స్కోర్ కార్డ్ విడుదల చేస్తున్నారు. నేటి (జూన్ 8) నుంచి అభ్యర్థులు తమ స్కోర్ కార్డును అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్‌లో స్కోర్ కార్డ్స్..
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2022) పరీక్ష మే 21న నిర్వహించగా జూన్ 1న ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేసినా పరీక్ష వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. NEET PG 2022 పరీక్ష తేదీని వాయిదా వేయబోమని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) కూడా స్పష్టం చేసింది. ఆ మేరకు పరీక్షను నిర్వహించి, తక్కువ రోజుల్లోనే ఫలితాలను కూడా ప్రకటించింది. ఇటీవల కేవలం ఫలితాలు విడుదల చేయగా, తాజాగా 800 మార్కులకుగానూ అభ్యర్థులకు వచ్చిన మార్కుల స్కోర్ కార్డును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తున్నారు.
నీట్ పీజీ స్కోర్‌కార్డ్ 2022 ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి (Steps to download NEET PG scorecard 2022)
- అధికారిక వెబ్‌సైట్ nbe.edu.in కు వెళ్లండి
- హోం పేజీలో నీట్ పీజీ ఎంట్రన్ ఎగ్జామ్ సెలక్ట్ చేసుకోవాలి
- అప్లికేషన్ లాగిన్ మీద క్లిక్ చేయండి
- యూజర్ పేరు, పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి
- నీట్ పీజీ 2022 స్కోర్ కార్డ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది
- మీ వివరాలు చెక్ చేసుకుని ప్రింటౌట్ తీసుకోండి
NEET PG 2022 Scorecardలో పేర్కొనే వివరాలు..
- అభ్యర్థి పేరు
- తండ్రి పేరు
- తల్లి పేరు
- పుట్టిన తేదీ
- కేటగిరీ
- పీడబ్ల్యూడీ(H) స్టేటస్
- రోల్ నెంబర్
- మార్కులు
- మొత్తం సరైన సమాధానాలు
- మొత్తం తప్పు సమాధానాలు
- నీట్ పీజీ ఆలిండియా ర్యాంక్
- నీట్ పీజీ కటాఫ్ మార్కులు
Also Read: NEET PG 2022 Result: నీట్ పీజీ ఫలితాలు విడుదల - చూసుకోండి ఇలా !