NEET MDS 2022 Admit Card: మెడికల్ స్టూడెంట్స్‌కు అలర్ట్ - నీట్ ఎండీఎస్ 2022 అడ్మిట్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
NEET MDS 2022 Admit Card: మాస్టర్ ఆఫ్ సర్జరీ కాలేజీలలో ప్రవేశ పరీక్ష కోసం నిర్వహించే నీట్ ఎండీఎస్ 2022 అడ్మిట్ కార్డ్స్ విడుదల కానున్నాయి.
NEET MDS Admit Card 2022: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) హాల్ టికెట్లు నేడు విడుదల కానున్నాయి. మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ కాలేజీలలో ప్రవేశ పరీక్ష కోసం నిర్వహించే నీట్ ఎండీఎస్ 2022 అడ్మిట్ కార్డ్ (NEET MDS 2022 Admit Card) నేడు విడుదల చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. మే 2వ తేదీన నీట్ ఎండీఎస్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు.
నీట్ ఎండీఎస్ అనేది డెంటిస్ట్ యాక్ట్ 1948 (తరువాత మార్పులు జరిగాయి) ఎండీఎస్ కోర్సులలో ప్రవేశానికి అర్హతతో పాటు ర్యాంకులను నీట్ ఎండీఎస్ ఎంట్రన్స్ (NEET MDS 2022 Test) ద్వారా నిర్ణయిస్తారు. రాష్ట్ర స్థాయిలో మరే ఇతర ఎంట్రన్స్ టెస్టుల ద్వారా ఎండీఎస్‌లో ప్రవేశాలు పొందలేరు. కనుక డెంటల్ సర్జరీలో మాస్టర్స్ చదవాలనుకునే వారు కచ్చితంగా నీట్ ఎండీఎస్ ఎంట్రన్స్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందులో వచ్చే ర్యాంకు ఆధారంగా దేశంలలోని ఆయా యూనివర్సిటీలు, సంస్థలలో ప్రవేశాలు కల్పిస్తారు.
నీట్ ఎండీఎస్ హాల్ టికెట్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకునే విధానం ( Download NEET MDS Admit Card 2022)
1. అభ్యర్థులు మొదట నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in కు వెళ్లాలి
2. హోం పేజీలో కనిపించే ఎగ్జామ్స్ ట్యాబ్ మీద క్లిక్ చేసి NEET MDS option ఎంచుకోవాలి.
3. నీట్ ఎండీఎస్ (NEET MDS) లింక్ మీద క్లిక్ చేయండి
4. అభ్యర్థులు మీ వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వాలి
5. స్క్రీన్ మీద మీ అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసి పెట్టుకోవడం బెటర్.
ఎగ్జామ్ మార్కులు విధానం
నీట్ ఎండీఎస్ 2022 లో 240 ప్రశ్నలు (NEET MDS 2022 Pattern) ఉంటాయి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలలో సరైన సమాధానాన్ని ఎంపిక చేసి సమాధానం ఇవ్వాలి. అయితే ఈ ఎంట్రన్స్ కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే నిర్వహిస్తారు. పరీక్ష గడువు మూడు గంటల సమయం. ఎండీఎస్ ఎగ్జామ్‌లో 25 శాతం నెగటివ్ మార్కింగ్ ఉంది. నాలుగు ప్రశ్నలకు తప్పు సమాధానం ఇస్తే ఒక్క మార్కు నెగటివ్ అవుతుంది.
Also Read: SSC Exams 2022 : పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
Also Read: TS EAMCET 2022: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త, ఎంసెట్‌లో ఏ వెయిటేజీ లేదు - పాస్ అయితే చాలు