అన్వేషించండి

NCERT Survey: విద్యార్థుల్లో ఆందోళనకు పరీక్షలు, ఫలితాలే కారణం! ఎన్‌సీఈఆర్టీ సర్వేలో వెల్లడి!

దేశవ్యాప్తంగా 33 శాతం మంది విద్యార్థులు పరీక్షలు, ఫలితాలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) నిర్వహించిన సర్వేలో తేలింది.

పరీక్షలు అంటేనే విద్యార్థులో ఓ రకమైన భయం ఉంటుంది. ఏం చదవాలి? ఎలా చదవాలి..? పరీక్షలు తప్పితే తల్లిదండ్రులు ఏమంటారో అని ఆందోళనకు గురవుతూ ఉంటారు. అలాగే పరీక్షల ఫలితాల సమయంలో పరిస్థితి ఇక చెప్పాల్సిన అవసరంలేదు. అయితే, పరీక్షలు, ఫలితాలే విద్యార్థుల్లో అధికశాతం మందిలో ఆందోళనకు కారణమని ఎన్‌సీఈఆర్టీ చేసిన ఓ సర్వే స్పష్టం చేసింది. 

దేశవ్యాప్తంగా 33 శాతం మంది విద్యార్థులు పరీక్షలు, ఫలితాలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సర్వేలో తేలింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) అన్ని రాష్ట్రాల్లోని 3.79 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై సర్వే చేపట్టింది. ఇందులో పాఠశాల జీవితం సంతృప్తి కలిగించిందని దాదాపు 73 శాతం మంది చెప్పారు. 

Also Read:  ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల

మరో 45శాతం మంది విద్యార్థులు తమ రూపంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తేలింది.  ప్రాథమికోన్నత పాఠశాల.. ఆ తర్వాతి చదువుల విద్యార్థులు చాలామంది తాము అందంగా లేమని.. శరీరాకృతి బాగోలేదనే భావనను వ్యక్తం చేశారని పేర్కొంది. అలాగే పిల్లలు మాధ్యమిక తరగతికి మారిన సమయంలో పాఠశాల జీవితంపై పాఠశాల జీవితంపై సంతృప్తి తగ్గుతున్నట్లు గుర్తించారు. 

Also Read:   నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!

సెకండరీ స్థాయిలో గుర్తింపు, సంబంధాలపట్ల సున్నితత్వం పెరగడం, తోటివారి ఒత్తిడి, బోర్డు పరీక్షల అంటే భయం, భవిష్యత్‌లో అడ్మిషన్ల గురించి ఆందోళన చెందుతున్నట్లు సర్వేలో తేలింది. 73శాతం మంది పాఠశాల జీవితంపై సంతృప్తి వ్యక్తంచేయగా.. మరో 28 శాతం మంది ప్రశ్నలు అడగడంలో తడబడుతున్నారు. ఎన్‌సీఈఆర్‌టీకి చెందిన మనోదర్పన్ ఈ సర్వేను నిర్వహించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య 6 నుంచి 8, 9 నుంచి 12 తరగతుల విద్యార్థులపై సర్వే జరిపారు.

51 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. 81శాతం మంది పిల్లలు తమ ఆందోళనకు చదువులు, పరీక్షలు, ఫలితాలు ముఖ్య కారణాలుగా పేర్కొన్నారు. చిన్నారుల మానసిక ఆరోగ్యం, శేయస్సుకు సంబంధించిన అంశాలపై వారి అవగాహనలను అర్థం చేసుకోవడంలో సహకరించేందుకు సర్వే నిర్వహించినట్లు ఎన్‌సీఈఆర్‌టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఒత్తిడిని ఎదుర్కొనేందుకు యోగా, ధ్యానం, విద్యార్థుల ఆలోచనలు మార్చడం, ఒత్తిడిని తగ్గించేందుకు ఉపకరిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.


Also Read:

TS EAMCET: ఎంసెట్‌ తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తి, వివరాలు ఇలా!
తెలంగాణలో ఎంసెట్ ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రి పూర్తయింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో అత్యధిక శాతం విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) కోర్సునే ఎంచుకొన్నారు. సీఎస్‌ఈ, ఐటీ తత్సమాన కోర్సుల్లో 98.49% సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్‌ఈలో మొత్తం 18,682 సీట్లు ఉంటే 18,666 సీట్లు భర్తీ అయ్యాయి. కేవలం 6 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. డేటా సైన్స్‌లో 99.64%, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌లర్నింగ్‌లో 98.97% సీట్లు భర్తీ అయ్యాయి. ఎంసెట్‌ తొలి విడుత సీట్ల కేటయింపును సాంకేతిక విద్యాశాఖ అధికారులు సెప్టెంబరు 6న పూర్తిచేశారు. యూనివర్సిటీ కాలేజీల్లో 84.99%, ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 77.94%, ప్రైవేట్‌ కాలేజీల్లో 84.56% చొప్పున సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా తొలి విడతలో 84.45% సీట్లు భర్తీ అయినట్టు అధికారులు ప్రకటించారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 4,943 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబరు 13లోగా ఫీజు చెల్లించాలని, 17 నుంచి 21లోపు జిరాక్స్‌ సర్టిఫికెట్లను కాలేజీల్లో సమర్పించి రిపోర్ట్‌చేయాలని అధికారులు సూచించారు.
కాలేజీల వారీగా సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Best Winter Train Rides in India : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Embed widget