National Science Day 2024: నేడు జాతీయ సైన్స్ దినోత్సవం, దీని వెనుక కథేంటి? `రామన్`ఎఫెక్ట్ ఎందుకంత స్పెషల్
నేడు(ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవం. భౌతికశాస్త్రంలో ఎనలేని కృషి చేసి దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన మహనీయుడు సర్ సీవీ రామన్ జ్ఞాపకార్థం ఈరోజును జాతీయసైన్స్ దినోత్సవంగాజరుపుతున్నారు.
National Science Day 2024: కొన్ని రోజులు జాతీయ దినోత్సవాలుగా రూపాంతరం చెందుతాయి.. దేశం మొత్తానికీ స్పూర్తిని నింపుతాయి. అలాంటి స్ఫూర్తిమంతమైన రోజే `ఫిబ్రవరి 28`. ఈ రోజుకు చాలా ప్రత్యేకతతోపాటు.. దీనివెనుక నిర్విరామ కృషి కూడా దాగి ఉంది. అందుకే.. దీనిని భారత ప్రభుత్వం(Indian Government) `జాతీయ సైన్స్ దినోత్సవం`(National Science Day)గా నామకరణం చేసింది. ఏటా ఈ రోజును ఘనంగా నిర్వహిస్తూ.. విద్యార్థులు, ఔత్సాహిక యువతలో స్ఫూర్తిని నింపుతోంది. ఈ దినోత్సవానికి కారణమైన ప్రఖ్యాత భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త సర్ సీవీ రామన్(Sir C.V. Raman) కృషిని.. ఆయన భౌతిక శాస్త్రంలో చేసిన సేవను విద్యార్థులకు మననం చేసుకునేలా చేస్తోంది.
ఎవరీ సీవీ రామన్?
సీవీ రామన్(చంద్రశేఖర వెంకట రామన్) భారత దేశ కీర్తి పతాను ప్రపంచ వ్యాప్తంగా రెపరెప లాడించిన భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త.1888 నవంబరు 7 వ తేదీన అప్పటి ఉమ్మడి మద్రాసులోని తిరుచినాపల్లిలో జన్మించారు. 1882లో తన తండ్రి విశాఖపట్నంలోని ఎ.వి.నరసింహారావు కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా పనిచేసేవారు. దీంతో పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా సి.వి.రామన్ కూడా చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, ఆయనను భౌతికశాస్త్రం వైపు మరింత ఆసక్తి కనబరిచేలా చేసిందనడంలో సందేహం లేదు. 12వ ఏటనే మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చారు. 18 ఏళ్ల వయసులోనే కాంతికి సంబంధించిన ధర్మాలపై పరిశోధనా వ్యాసం రాశారు. ఇది లండన్ కు చెందిన ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది.
విడదీయరాని బంధం..!
సైన్స్ మానవ జీవితాన్ని ఊహించలేని విధంగా సరళీకృతం చేసింది. ఐఫోన్ నుండి విమానాల వరకు మరియు కంప్యూటర్ల నుండి రోబోల వరకు, ఈ రోజు మనిషి సైన్స్ సహాయంతో ప్రతిదీ సాధించగలడు. దీన్ని బట్టి మన జీవితంలో సైన్స్ ఏమి చేయగలదో అంచనా వేయవచ్చు. శాస్త్రీయ విజయాలు అంతర్జాతీయంగా మాత్రమే ఉంటాయి. ఇది స్థాయికి పరిమితం కాదు. శాస్త్రీయ భారతీయ శాస్త్రవేత్తలు కూడా దూసుకుపోతున్నారు. స్పెక్ట్రోస్కోపీలో అరుదైన ఆవిష్కరణ చేసిన చంద్రశేఖర వెంకటరామన్ అటువంటి గొప్ప శాస్త్రవేత్త. అతని పేరు మీద 'రామన్ ఎఫెక్ట్' లేదా రామన్ 'స్కాటరింగ్' అని పేరు పెట్టారు. ఈ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి భారతదేశం ప్రతి ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది.
ఆ రోజు ఏం జరిగింఇ?
28 ఫిబ్రవరి 1928న సర్ సీవీ రామన్ (C.V.Raman) భారతదేశంలో 'రామన్ ఎఫెక్ట్సను ఆవిష్కరించి శాస్త్రవేత్తలను దిగ్భ్రాంతికి గురిచేశారు. దీనికి అచ్చరవొందిన బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని బ్రిటీష్ ప్రభుత్వం పేర్కొంది. ఇక, భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28ని 'నేషనల్ సైన్స్ డేసగా నిర్వహిస్తోంది. సైన్స్ ప్రయోజనాల గురించి సామాజిక అవగాహన కల్పించడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి 'నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ`, 'మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ' ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏటా ఫిబ్రవరి 28న నిర్వహిస్తున్నారు.
ఏమిటీ రామన్ ఎఫెక్ట్?
రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది అనేదే రామన్ ఎఫెక్ట్. ఈ దృగ్విష యాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో రామన్ శాస్త్రీయ ఆధారాలతో చేసి చూపించారు. ఈ ప్రయోగానికి ఆయనకు అయిన ఖర్చు రూ.200.
బిరుదులు, సత్కారాలు..
+ నోబెల్ పురస్కారం
+ భారతరత్న
+ లెనిన్ శాంతి బహుమతి