News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

JEE (Main) - 2023 దరఖాస్తుకు నేడే ఆఖరు! వెంటనే దరఖాస్తు చేసుకోండి!

JEE Main-2023 మొదటి సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 12తో ముగియనుంది. ఇప్పటికవరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు రాత్రి 11.50 గంటలలోపు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది.

FOLLOW US: 
Share:

జేఈఈ మెయిన్-2023 మొదటి సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 12తో ముగియనుంది. ఇప్పటికవరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు రాత్రి 11.50 గంటలలోపు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. మొదటి విడత జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబరు 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలను జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభంకానుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

పరీక్ష విధానం:

➥ జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సు్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. 

➥ ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.

➥ బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.

ముఖ్యమైన తేదీలివే..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.12.2022.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.01.2023.  (9:00 P.M.)

 ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.01.2023.  (11:50 P.M.)

➥ సిటీ ఎగ్జామినేషన్ వివరాల వెల్లడి: 2023, జనవరి రెండోవారంలో. 

 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 2023, జనవరి మూడోవారంలో. 

➥ పరీక్ష తేది: 2023, జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో.

 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల వెల్లడి: తర్వాత ప్రకటిస్తారు.

JEE (Main) – 2023 Schedule 
JEE (Main) - 2023 Notification
Eligibility Criteria

JEE (Main) – 2023 Online Application

Official Website 

Also Read

జేఈఈ మెయిన్ మాక్ టెస్టులు అందుబాటులో! ఎలా యాక్సెస్ చేయాలంటే?
జేఈఈ మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ టెస్ట్ అభ్యాస్ మొబైల్ యాప్‌లో ఈ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యాస్ యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాన్ని పరిచయం చేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జేఈఈ మెయిన్య 2023 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉచితంగానే ఈ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయవచ్చు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 12 Jan 2023 11:50 AM (IST) Tags: JEE Main 2023 JEE Main Registration 2023 JEE Main January 2023 Exam JEE Main January 2023 JEE Main 2023 Session 1 Exam JEE Main 2023 January Session

ఇవి కూడా చూడండి

జేఈఈ మెయిన్ దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

జేఈఈ మెయిన్ దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Polytechnic Branches: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్

Polytechnic Branches: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్

CAT 2023 Exam: క్యాట్‌-2023 పరీక్షకు వేళాయే - హాజరుకానున్న 3.3 లక్షల మంది అభ్యర్థులు, ఇవి పాటించాల్సిందే!

CAT 2023 Exam: క్యాట్‌-2023 పరీక్షకు వేళాయే - హాజరుకానున్న 3.3 లక్షల మంది అభ్యర్థులు, ఇవి పాటించాల్సిందే!

టాప్ స్టోరీస్

TS Election Voting: ఉదయమే ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ - క్యూ లైనులో స్టార్స్, మరి మీరు?

TS Election Voting: ఉదయమే ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ - క్యూ లైనులో స్టార్స్, మరి మీరు?

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం

Telangana Election Polling Updates: తెలంగాణలో ఓట్ల జాతర- 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు

Telangana Election Polling Updates: తెలంగాణలో ఓట్ల జాతర- 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు

Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం

Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం