News
News
X

TS PGECET - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?

అభ్యర్థులు ఎలాంటి ఆల‌స్య రుసుం లేకుండా ఏప్రిల్ 30 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మే 2 నుంచి 4 మ‌ధ్యలో ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో TS PGECET-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆల‌స్య రుసుం లేకుండా ఏప్రిల్ 30 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మే 2 నుంచి 4 మ‌ధ్యలో ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. రూ.250 ఆల‌స్య రుసుంతో మే 5 వ‌ర‌కు, రూ. 1000 ఆలస్య రుసుముతో మే 10 వరకు, రూ.2,500 ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ.5,000 ఆల‌స్య రుసుంతో మే 24 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మే 21 నుంచి టీఎస్ పీజీఈసెట్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీ-హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) 'టీఎస్ పీజీఈసెట్' నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 28న విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే.  ఈ నోటిఫికేష‌న్ ద్వారా 2023-24 విద్యా సంవ‌త్సరానికి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పించ‌నున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.

పరీక్ష విధానం:
మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు, పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతం (30 మార్కులు)గా నిర్నయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

'TS PGECET-2023' షెడ్యూలు ఇలా..

➥  పీజీసెట్‌ నోటిఫికేషన్‌: 28.02.2023.

➥  ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:  03.03.2023.

➥  ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ (అపరాద రుసుము లేకుండా: 30.04.2023.

➥ రూ.250 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 05.05.2023.

➥ రూ.1000 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 10.05.2023.

➥ రూ.2500 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.05.2023.

➥ రూ.5000 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 24.05.2023.

➥ దరఖాస్తు ఫీజు: రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600

➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 21.05.2023 నుంచి.

➥  పరీక్ష తేదీలు: 29.05.2023 - 01.06.2023 వరకు.

పీజీఈసెట్-2023 నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

Online Application

Exam Syllabus

Also Read:

టీఎస్‌ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 1న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. మార్చి 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు మొదలైంది. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు లాసెట్, పీజీఎల్ సెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న టీఎస్‌ లాసెట్‌, టీఎస్‌ పీజీఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
లాసెట్ నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

టీఎస్ ఎడ్‌సెట్-2023 షెడ్యూల్ విడుద‌ల‌, ప‌రీక్ష తేది ఇదే!
తెలంగాణలో బీఈడీ కళాశాలల్లో బీఎడ్ కోర్సులో ప్రవేశాల‌కు నిర్వహించే 'టీఎస్ ఎడ్‌సెట్ – 2023' షెడ్యూల్ విడుద‌లైంది. తెలంగాణ ఉన్నత విద్యామండ‌లి( TSCHE ) చైర్మన్ ప్రొఫెస‌ర్ ఆర్. లింబాద్రి, టీఎస్ ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్, మ‌హాత్మాగాంధీ వ‌ర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి క‌లిసి షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. మార్చి 4 నుంచి ఎడ్‌సెట్ నోటిఫికేష‌న్ అందుబాటులో ఉండనుంది. మార్చి 6 నుంచి ఎడ్‌సెట్ ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500, ఇత‌ర కేట‌గిరీల అభ్యర్థులు రూ. 700 చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
టీఎస్ ఎడ్‌సెట్-2023 షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 05 Mar 2023 05:46 PM (IST) Tags: Education News in Telugu TS PGECET Notification TS PGECET Exam Dates PGECET 2023 Application TS PGECET 2023 Notification

సంబంధిత కథనాలు

KNRUHS Final MBBS Results: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

KNRUHS Final MBBS Results: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?

APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?

టాప్ స్టోరీస్

Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల ఘటనపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల ఘటనపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్

Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత

Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్  ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత