TS EdCET: టీఎస్ ఎడ్‌సెట్-2023 షెడ్యూల్ విడుదల, పరీక్ష తేది ఇదే!
తెలంగాణలో బీఈడీ కళాశాలల్లో బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే 'టీఎస్ ఎడ్‌సెట్ – 2023' షెడ్యూల్ విడుదలైంది. మార్చి 4 నుంచి ఎడ్‌సెట్ నోటిఫికేషన్ అందుబాటులో ఉండనుంది.
తెలంగాణలో బీఈడీ కళాశాలల్లో బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే 'టీఎస్ ఎడ్‌సెట్ – 2023' షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి( TSCHE ) చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, టీఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి కలిసి షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చి 4 నుంచి ఎడ్‌సెట్ నోటిఫికేషన్ అందుబాటులో ఉండనుంది. మార్చి 6 నుంచి ఎడ్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500, ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ. 700 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మార్చి 30న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. మే 5 నుంచి ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. మే 18న ప్రవేశ పరీక్ష నిర్వహించి, మే 21న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించి, తదనంతరం ఫైనల్ కీతోపాటు, ఫలితాలను విడుదల చేస్తారు.
ఎడ్‌సెట్ షెడ్యూలు ఇలా..
➥ మార్చి 4న ఎడ్‌సెట్ నోటిఫికేషన్
➥ మార్చి 6 నుంచి ఎడ్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.
➥ ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్ 20
➥ రూ. 250 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్ 25.
➥ మార్చి 30న దరఖాస్తుల ఎడిట్.
➥ మే 5 నుంచి ఎడ్‌సెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్.
➥ మే 18న ప్రవేశ పరీక్ష నిర్వహణ.
➥ మే 21న ప్రాథమిక కీ విడుదల.
➥ ఫైనల్ కీ వెల్లడి తేది: ప్రకటించాల్సి ఉంది.
➥ ఫలితాల వెల్లడి: ప్రకటించాల్సి ఉంది.
Also Read:
టీఎస్ ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?
టీఎస్ ఎంసెట్-2023 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023) దరఖాస్తు ప్రక్రియ మార్చి 3న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
TSRJC CET - 2023: టీఎస్ఆర్జేసీ సెట్–2023 నోటిఫికేషన్ వెల్లడి, ప్రవేశపరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023–24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్–2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి. పదోతరగతి అర్హత ఉన్న విద్యార్థులతోపాటు, ప్రస్తుతం టెన్త్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూలు ఖరారు, పరీక్షలు ఎప్పుడంటే?
తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 1న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూలును ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మీతో కలిసి ఆయన విడుదల చేశారు. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు లాసెట్, పీజీఎల్ సెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న పరీక్ష నిర్వహించనున్నారు.
లాసెట్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..