అన్వేషించండి

JEE Main 2026 సెషన్-2 కోసం దరఖాస్తులు ప్రారంభం.. అప్లికేషన్ ఫీజు, ముఖ్యమైన తేదీలు ఇవే

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE Main 2026 (జేఈఈ మెయిన్ 2026) సెషన్-2 పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. అయితే అభ్యర్థుల అర్హతలు, ఫీజు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ రంగంలో కెరీర్ కోసం కలలు కనే విద్యార్థులకు ఇది ముఖ్యమైన వార్త. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE మెయిన్ 2026 సెషన్ II కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత సమయంలో జేఈఈ మెయిన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. JEE మెయిన్ ఎగ్జామ్ ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది.

పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA నిర్వహించే JEE మెయిన్ 2026 సెషన్-2 పరీక్ష ఏప్రిల్ నెలలో ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. NTA JEE మెయిన్ 2026 సెషన్-2 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 25, 2026 రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. JEE మెయిన్ సెషన్-2 పరీక్ష ఏప్రిల్ 02 నుండి ఏప్రిల్ 09, 2026 వరకు ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నారు. పరీక్ష కోసం అడ్మిట్ కార్డులు పరీక్షకు 3 రోజుల ముందు అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతారు. పరీక్ష ముగిసిన తర్వాత, సమాధానాల కోసం ఆన్సర్ కీ విడుదల చేయనున్నారు. అయితే ఫలితాలు త్వరగానే ప్రకటిస్తారు. 

దరఖాస్తు రుసుము ఎంత?

NTA JEE మెయిన్ 2026 సెషన్-2 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా కేటగిరీల ప్రకారం ఎగ్జామ్ ఫీజును చెల్లించాలి. JEE మెయిన్ 2026 సెషన్-2లో పేపర్-1 (B.E./B.Tech) కోసం మాత్రమే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ కేటగిరీ ప్రకారం ఫీజులు ఉంటాయి. జనరల్ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజరు రూ. 1000 ఉండగా,  జనరల్, OBC, EWS కేటగిరీలకు చెందిన మహిళా అభ్యర్థులు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు SC, ST కేటగిరీలకు చెందిన పురుషులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 500 చెల్లించాలి . అభ్యర్థులు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ-చలాన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

 2 పేపర్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు.. 
పేపర్-1 (B.E./B.Tech)తో పాటు పేపర్-2 (B.Arch / B.Planning) కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రెండు పేపర్లకు నిర్ణీత ఫీజు చెల్లించాలి. జనరల్, OBC, EWS కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులకు ఈ రుసుము రూ. 2000. ఈ కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థులు రూ. 1600 దరఖాస్తు రుసుము చెల్లించాలి. దీనితో పాటు SC, ST కేటగిరీలకు చెందిన పురుషులు, మహిళా అభ్యర్థులకు రెండు పేపర్లకు రూ. 1000 చెల్లించాలి. 

అర్హత ఏమిటి?

JEE మెయిన్ 2026 సెషన్-2 కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితో పాటు, 2026లో 12వ తరగతి (ఇంటర్) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష రాయాలంటే అభ్యర్థి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (PCM) సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. P C M సబ్జెక్టులు లేని అభ్యర్థులు JEE మెయిన్ పరీక్షకు అర్హులుగా పరిగణించరు.

దరఖాస్తు ప్రక్రియ

  • JEE మెయిన్ అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.nic.in/ ను సందర్శించండి.
  • తరువాత రిజిస్ట్రేషన్ చేసుకోండి. అనంతరం మీ వివరాలతో లాగిన్ అవ్వండి.
  • అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి 
  • అభ్యర్తి ఫోటో, సంతకం, సంబంధిత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
  • మీ కేటగిరి ఆధారంగా తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
  • అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేసిన తరువాత, ప్రింట్ అవుట్‌ తీసి భవిష్యత్ అవసరరాల కోసం భద్రపరచుకోండి.


About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
Study in Germany: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget