News
News
వీడియోలు ఆటలు
X

JEE Advanced 2023: జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష - దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?

ఇప్పటికే జేఈఈ మెయిన్‌-1 పూర్తికాగా, ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్‌-2 నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధిస్తారు.

FOLLOW US: 
Share:

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 పరీక్ష షెడ్యూలు ఇటీవల వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ గువాహటి నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనుంది. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఏప్రిల్‌ 30 నుంచి మే 7 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటికే జేఈఈ మెయిన్‌-1 పూర్తికాగా, ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్‌-2 నిర్వహించనున్నారు. ఈ రెండు సెషన్ల ఫలితాలను ఏప్రిల్ చివరివారంలో వెల్లడించే అవకాశం ఉంది. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధిస్తారు. దీని ఫలితాల ఆధారంగా ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్‌, బీఎస్‌, బీఆర్క్‌, ఐదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

రెండు పరీక్షలకు హాజరుకావాల్సిందే..! 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో భాగంగా జూన్‌ 4న ఉదయం, మధ్యాహ్నం నిర్వహించే రెండు పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. ఈ రెండు పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలనే ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌ పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు కనీసం 8 పట్టణాలను ఎంపిక చేసుకొనే వెసులుబాటు ఉంది.

ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌.. 
బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది. వారణాసి, ఖరగ్‌పూర్‌, రూర్కీల్లోని ఐఐటీల్లో బీఆర్క్‌ (ఆర్కిటెక్చర్‌)కోర్సులను నిర్వహిస్తున్నారు. జూన్‌ 18,19న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఏఏటీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 21న ఏఏటీ పరీక్ష నిర్వహించి, జూన్‌ 24న ఫలితాలను ప్రకటించనున్నారు.

ముఖ్యమైన తేదీలు...

Also Read:

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి, ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2023 సెషన్-2కు సంబంధించి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలోనే విడుదల చేయనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12 వరకు సెషన్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల అడ్మిట్ కార్డులను వారం రోజుల్లో అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. 
పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

నీట్ పీజీ - 2023 స్కోరుకార్డు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
దేశవ్యాప్తంగా వైద్య విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) మెడికల్ సీట్ల భర్తీకి నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు మార్చి 14న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 5న నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అయితే నీట్ పీజీ స్కోరుకార్డులను మార్చి 26న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో స్కోరుకార్డులను అందుబాటులో ఉంచింది. 
నీట్ పీజీ స్కోరుకార్డు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 27 Mar 2023 11:22 AM (IST) Tags: JEE Advanced 2023 JEE Advanced 2023 Registration JEE Advanced 2023 Exam Date JEE Advanced 2023 Schedule JEE Advanced 2023 Notification

సంబంధిత కథనాలు

TS EAMCET Counselling: ఎంసెట్‌లో ఏ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో తెలుసుకోండి! గతేడాది సీట్ల కేటాయింపు ఇలా!

TS EAMCET Counselling: ఎంసెట్‌లో ఏ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో తెలుసుకోండి! గతేడాది సీట్ల కేటాయింపు ఇలా!

TSITI: తెలంగాణలో ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలు, అర్హతలివే!

TSITI: తెలంగాణలో ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలు, అర్హతలివే!

UPSC 2023 Civils Exam: మే 28న సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

UPSC 2023 Civils Exam: మే 28న సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TS EAMCET Counselling: టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌! ముఖ్యమైన తేదీలివే!

TS EAMCET Counselling: టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌! ముఖ్యమైన తేదీలివే!

TSRTC Nursing Admissions: టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో న‌ర్సింగ్ క‌ళాశాల, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!

TSRTC Nursing Admissions: టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో న‌ర్సింగ్ క‌ళాశాల, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!

టాప్ స్టోరీస్

KCR Press Meet: ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్న కేంద్రం, ఢిల్లీ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్

KCR Press Meet: ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్న కేంద్రం, ఢిల్లీ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్

New Parliament Inauguration Live: కాసేపట్లో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం, పాల్గోనున్న 25 పార్టీలు, బహిష్కరించిన 21 పార్టీలు

New Parliament Inauguration Live: కాసేపట్లో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం, పాల్గోనున్న 25 పార్టీలు, బహిష్కరించిన 21 పార్టీలు

New Parliament Inauguration: కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఏమిటి, దానిని ఏ సమయంలో ప్రారంభిస్తారు, ఎవరికి ఆహ్వానం పంపారు? అన్నీ తెలుసుకోండి

New Parliament Inauguration: కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఏమిటి, దానిని ఏ సమయంలో ప్రారంభిస్తారు, ఎవరికి ఆహ్వానం పంపారు? అన్నీ తెలుసుకోండి

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు