(Source: ECI/ABP News/ABP Majha)
NEET PG Scorecard 2023: నీట్ పీజీ - 2023 స్కోరుకార్డు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
నీట్ పీజీ స్కోరుకార్డులను మార్చి 26న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో స్కోరుకార్డులను అందుబాటులో ఉంచింది.
దేశవ్యాప్తంగా వైద్య విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) మెడికల్ సీట్ల భర్తీకి నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు మార్చి 14న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 5న నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అయితే నీట్ పీజీ స్కోరుకార్డులను మార్చి 26న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో స్కోరుకార్డులను అందుబాటులో ఉంచింది. వాస్తవానికి మార్చి 25న విడుదల చేయాల్సిన స్కోరు కార్డులను ఒకరోజు ఆలస్యంగా విడుదల చేసింది.
స్కోరుకార్డు కోసం క్లిక్ చేయండి..
కటాఫ్ మార్కులు ఇలా..
అలాగే, 800 మార్కులకుగానూ జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 291 మార్కుల కటాఫ్‌ను నిర్ణయించగా.. జనరల్-పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 274 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ వారికి 257 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించింది. అంటే పరీక్షలో అర్హత సాధించాలంటే జనరల్, ఈడబ్యూఎస్ అభ్యర్థులు 50 పర్సంటైల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 40 పర్సంటైల్ సాధించాలి. ఆయా కేటగిరీలవారు నిర్దేశిత మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారు.
ఇక రాష్ట్రంలో మొత్తం 2,453 మెడికల్ పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1393, ప్రైవేటులో 1060 సీట్లు ఉన్నాయి. నీట్ పీజీ 2023 ప్రవేశపరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సు్లతోపాటు పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్‌బీ కోర్సులు, ఆరేండ్ల డీఆర్‌ఎన్‌బీ కోర్సులు, పోస్ట్ ఎంబీబీఎస్ ఎన్‌బీఈఎంఎస్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
కాగా, ఢిల్లీ ఎయిమ్స్‌తో పాటు దేశంలోని ఇతర ఎయిమ్స్, చండీగఢ్ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుదుచ్చేరిలోని జిప్‌మర్, బెంగళూరులోని నిమ్‌హాన్స్, త్రివేండ్రంలోని చిత్ర తిరునాల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సంస్థల్లో అడ్మిషన్లకు నీట్ ప్రవేశ పరీక్ష వర్తించదని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ (NBE) వెల్లడించిన విషయం తెలిసిందే.
జులైలో కౌన్సెలింగ్..
నీట్ పీజీ 2023 కౌన్సెలింగ్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) జులై నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. పీజీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులుఆగస్టు 11లోపు మెడికల్ ఇంటర్న్‌షిప్ పూర్తయ్యేలా ఉండాలి.
Also Read:
జేఈఈ మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి, ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2023 సెషన్-2కు సంబంధించి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలోనే విడుదల చేయనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12 వరకు సెషన్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల అడ్మిట్ కార్డులను వారం రోజుల్లో అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ (సెషన్ 2) పరీక్ష కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి మార్చి 12 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్న విషయం తెలిసిందే. అడ్మిట్ కార్డులతో పాటు పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌లలో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.
పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..