News
News
వీడియోలు ఆటలు
X

JEE Main 2023 Admit Card: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి, ఎప్పుడంటే?

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12 వరకు సెషన్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల అడ్మిట్ కార్డులను వారం రోజుల్లో అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్టు ఎన్టీఏ తెలిపింది.

FOLLOW US: 
Share:

దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2023 సెషన్-2కు సంబంధించి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలోనే విడుదల చేయనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12 వరకు సెషన్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల అడ్మిట్ కార్డులను వారం రోజుల్లో అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ (సెషన్ 2) పరీక్ష కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి మార్చి 12 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్న విషయం తెలిసిందే. అడ్మిట్ కార్డులతో పాటు పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌లలో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

➥ అడ్మిట్ కార్డుల కోసం విద్యార్థులు మొదటి అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.- jeemain.nta.nic.in 

➥ హోంపేజీలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023 సెషన్‌-2కు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.

➥ విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.

➥ జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనబడుతుంది.

➥ ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓ కాపీని ప్రింటవుట్ తీసుకుని పెట్టుకోవాలి.

➥ కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం పేరు, ఇతర వివరాలన్నీ ఉన్నాయో, లేదో సరిచూసుకోండి.

పరీక్ష విధానం:

➥ జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సులో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. 

➥ ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.

➥ బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.

జేఈఈ తేదీలివే..
దేశంలోని ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. మెయిన్‌లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్‌లో నిర్వహిస్తారు. అందులో వచ్చే ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహిస్తున్న ఎన్‌టీఏ.. జనవరిలో తొలి సెషన్‌ పరీక్షలను జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించింది. ఇక రెండో సెషన్ పరీక్షలను ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనుంది.

ALso Read:

జేఈఈ మెయిన్ మాక్ టెస్టులు అందుబాటులో! ఎలా యాక్సెస్ చేయాలంటే?
జేఈఈ మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ టెస్ట్ అభ్యాస్ మొబైల్ యాప్‌లో ఈ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యాస్ యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాన్ని పరిచయం చేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జేఈఈ మెయిన్య 2023 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉచితంగానే ఈ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయవచ్చు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 27 Mar 2023 09:39 AM (IST) Tags: Education News in Telugu JEE Main Admit Card 2023 NTA JEE Hall Ticket 2023 JEE Main 2023 exam Admit Card JEE Main 2023 Session 2 Admit Cards

సంబంధిత కథనాలు

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

టాప్ స్టోరీస్

Vijayashanthi: విజయశాంతి బీజేపీని వీడతారంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన రాములమ్మ

Vijayashanthi: విజయశాంతి బీజేపీని వీడతారంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన రాములమ్మ

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్‌- ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది 8 మంది: మంత్రి అమర్‌నాథ్‌

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్‌- ఆసుపత్రిలో చికిత్స  తీసుకుంటుంది 8 మంది: మంత్రి అమర్‌నాథ్‌

Wrestlers Protest: నిరసనల నుంచి సాక్షి మాలిక్ తప్పుకున్నారంటూ వార్తలు, ఫేక్ అని కొట్టిపారేసిన రెజ్లర్

Wrestlers Protest: నిరసనల నుంచి సాక్షి మాలిక్ తప్పుకున్నారంటూ వార్తలు, ఫేక్ అని కొట్టిపారేసిన రెజ్లర్

Nothing Phone 2: కొత్త ఫోన్‌తో రానున్న నథింగ్ - ఈసారి మరిన్ని స్పెషల్ ఫీచర్లు!

Nothing Phone 2: కొత్త ఫోన్‌తో రానున్న నథింగ్ - ఈసారి మరిన్ని స్పెషల్ ఫీచర్లు!