(Source: ECI/ABP News/ABP Majha)
APSWREIS: డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.
APSWREIS Inter Admissions: తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మార్చిలో జరిగే పదోతరగతి పరీక్షలో అర్హత సాధించాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు.
అర్హులైన బాలబాలికలు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 23లోగా దరఖాస్తులు సమర్పించాలి. ఒకసారి దరఖాస్తు అప్‌లోడ్ చేసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ వివరాల్లో మార్పులకు అవకాశం ఉండదు. కాబట్టి వివరాలు జాగ్రత్తగా నమోదుచేయాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. రాష్ట్రంలోని 164 గురుకుల జూనియర్ కాలేజీల్లో మొత్తం 13,230 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎస్సీలకు ఎస్సీలకు 75%, బీసీ-సి (ఎస్సీ-కన్వర్టెడ్ క్రిస్టియన్స్)లకు 12%, ఎస్టీలకు 6%, బీసీలకు 5%, ఇతరులకు 2% సీట్లు కేటాయించారు. వీటిలో ఐఐటీ మెడికల్ అకడమీలో ఎంపీసీ 300 సీట్లు, బైపీసీ 300 సీట్లు ఉన్నాయి.
వివరాలు..
* డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల ప్రవేశాలు (బీఆర్‌ఏజీ ఇంటర్ సెట్-2024)
సీట్ల సంఖ్య: 13,230.
సీట్ల కేటాయింపు: ఎస్సీలకు 75%, బీసీ-సి (ఎస్సీ-కన్వర్టెడ్ క్రిస్టియన్స్)లకు 12%, ఎస్టీలకు 6%, బీసీలకు 5%, ఇతరులకు 2% సీట్లు కేటాయించారు.
ఇంటర్ గ్రూప్, సీట్లు: ఎంపీసీ- 5,400, బైపీసీ- 5,400, ఎంఈసీ- 800, సీఈసీ- 1600, హెచ్ఈసీ- 360.
అర్హత: విద్యార్థులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువు పూర్తిచేసి ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు.
వయోపరిమితి: 31.08.2024 నాటికి 17 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. గణితం- 25, ఫిజికల్ సైన్స్- 15, బయాలజీ- 15, సోషల్ స్టడీస్- 15, ఇంగ్లిష్- 15, లాజికల్ రీజనింగ్- 15 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 24.01.2024
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.01.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 23.02.2024.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 02.03.2024.
➥ ప్రవేశ పరీక్ష తేది: 10.03.2024. (పరీక్ష సమయం: 2.00 PM to 4.30 PM)
➥ మార్చి 10న నిర్వహించిన పరీక్షలో మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కోసం IIT-మెడికల్ అకాడమీలో ప్రవేశ పరీక్ష తేది: 2 1.04.2024
ALSO READ:
APSWREIS: డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 3వ తరగతి, 2022-23 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువు పూర్తిచేసి ఉండాలి.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..