అన్వేషించండి

Which Course Is Better After Inter : ఇంటర్ తర్వాత మెరుగైన భవిష్యత్తునిచ్చే ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు

Career Options After 12th: ఇంటర్ తర్వాత సాధారణంగా గ్రాడ్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులతో డైరెక్ట్ గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయొచ్చు.

Career Options After 12th: ఇంటర్ తర్వాత సాధారణంగా గ్రాడ్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులతో డైరెక్ట్ గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయొచ్చు. ఇంటిగ్రేటెడ్ కోర్సులంటే ఒకటి కంటే ఎక్కువ వేర్వేరు సబ్జెక్టులు ఒకే కోర్సులో కలిపి ఉంటాయి. దీనివల్ల ఒకటి కంటే ఎక్కువ రంగాల మీద నైపుణ్యంతో పాటు ఆయా రంగాల్లో పట్టా కూడా ఒకేసారి పొందవచ్చు. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సంటే ఇంకా అదనపు ప్రయోజనం. వీటిలో కొన్ని కోర్సులు ఇంటర్ తోనే అందుబాటులో ఉండటం విశేషం.

ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను ప్రవేశ పెట్టాలన్న నిర్ణయం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, వాటి ఆదరణ మాత్రం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. మారుతున్న ఆధునికీకరణకు అనుగుణంగా కొత్త సబ్జెక్ట్స్ తో విద్యాసంస్థలు ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

బీఏ ఎల్ ఎల్ బీ ఇంటిగ్రేటెడ్ కోర్సు

సాధారణంగా బీఏ పూర్తయిన తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఎల్ ఎల్ బీ వైపు వెళ్తారు. అందుకని చాలమటుకు యూనివర్సిటీలు ఇంటర్ అర్హతతోనే బీఏ ఎల్ ఎల్ బీ ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తున్నాయి. దీనివల్ల కేవలం ఐదేళ్లలోనే ఇంటర్ తర్వాత లా పట్టా పొందవచ్చు. ఈ కోర్సులో ప్రవేశానికి లాసెట్, క్లాట్ ఎంట్రన్స్ టెస్టుల మెరిట్ చూస్తారు.

బీటెక్ ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్సు

బీటెక్ తర్వాత ఎంబీఏ చేస్తున్న విద్యార్థుల సంఖ్య యేటేటా పెరుగుతూనే ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రాం వల్ల ఈ రెండూ ఇంటర్ తర్వాత ఒకేసారి చేయొచ్చు. అందుకే కార్పొరేట్ విద్యాసంస్థలు బీటెక్ ఎంబీఏ కోర్సులు అందించటానికే మొగ్గు చూపుతున్నాయి.

బీఎస్సీ ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సు

సైన్సు కోర్సుల్లో బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ లో చేరటం సర్వసాధారణం. కొన్ని సెంట్రల్ యూనివర్సిటీలు ఈ ఇంటిగ్రేటెడ్ పీజీ తో పాటూ, ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి అదే యూనివర్సిటీలో పీ హెచ్ డీ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. బీఎస్సీ ఎం ఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తయిన వారికి ఐ.ఎం ఎస్సీ సర్టిఫికేట్ లభిస్తుంది. 

లాంగ్వెజెస్ లో కూడా ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు

సైన్సు, సోషల్ కోర్సులు కాకుండా లాంగ్వెజెస్ మీద పీజీ కోర్సులు చేయాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అందుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోకుండా ఇది వరకు వేరే మార్గాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఇంటర్ తోనే ఫారెన్ లాంగ్వెజెస్ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందించటంతో పాటూ ఎంతో ప్రాచుర్యం కూడా పొందాయి. వాటిలో ముఖ్యమైన యూనివర్సిటీలు..ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వెజ్ యూనివర్సిటీ-హైదరాబాద్, బిట్స్ పిలానీ, ఢిల్లీ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐఎం ఇండోర్, ఐఐటీ ఖరగ్పూర్ మొదలైనవి.

ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రాముల వల్ల విద్యార్థులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇంటర్ తోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవటం ఒకటైతే..నచ్చిన స్పెషలైజేషన్లు రెండూ ఒకేసారి పూర్తి చేసుకోవటం, అందులోనూ ఒక్కో స్పెషలైజేషన్ ని బట్టి ఒకటి లేదా రెండు సంవత్సరాలు సేవ్ అవటం. దానితో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక చాలమంది విద్యార్థులకు పలు రకాల ఆలోచనలతో వేరే కోర్సులో చేరితే బాగుండేది అనుకోకుండా ఆ రెండు కోర్సులను కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ కోర్సుగా రూపొందించటం మరొక ప్లస్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget