IIIT Sri City PhD Admissions: ట్రిపుల్‌ఐటీ శ్రీసిటీ, చిత్తూరులో పీహెచ్‌డీ కోర్సులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
చిత్తూరు-శ్రీ సిటీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) 2024 విద్యాసంవత్సరానికి (మాన్‌సూన్)గాను పీహెచ్‌డీ ఫుల్‌టైం/పార్ట్‌టైమ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
IIIT Sri City PhD Admissions: చిత్తూరు-శ్రీ సిటీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) 2024 విద్యాసంవత్సరానికి (మాన్‌సూన్)గాను పీహెచ్‌డీ ఫుల్‌టైం/పార్ట్‌టైమ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 20న ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. ఫుల్‌టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. అదేవిధంగా పార్ట్-టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు షార్ట్‌లిస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి సంస్థ/ఎంహెచ్‌ఆర్డీ నిబంధనల మేరకు రూ.37,000 -రూ.42,000 వరకు ఫెలోషిప్ అందిస్తారు.
వివరాలు..
* పీహెచ్‌డీ ప్రోగ్రామ్
1) పీహెచ్‌డీ ఫుల్‌టైం ప్రోగ్రామ్- మాన్‌సూన్ 2024
విభాగాలు: సీఎస్‌ఈ, ఈసీఈ, మ్యాథమెటిక్స్ & డేటా సైన్స్.
అర్హతలు..
➥ సీఎస్‌ఈ విభాగానికి మాస్టర్స్ డిగ్రీ (ఎంఈ/ఎంటెక్) అర్హత ఉండాలి. (లేదా) సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌తోపాటు ఎంఎస్ రిసెర్చ్ (లేదా) సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్‌తోపాటు ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత ఉండాలి.
➥ ఈసీఈ విభాగానికి మాస్టర్స్ డిగ్రీ (ఎంఈ/ఎంటెక్) అర్హత ఉండాలి. (లేదా) సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌తోపాటు ఎంఎస్ రిసెర్చ్ (లేదా) సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్‌తోపాటు ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత ఉండాలి.
➥ మ్యాథమెటిక్స్ & డేటా సైన్స్ విభాగానికి మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్ విభాగాల్లో 60 శాతంతో డిగ్రీతోపాటు పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
2) పీహెచ్‌డీ పార్ట్‌టైమ్ ప్రోగ్రామ్- మాన్‌సూన్ 2024
విభాగాలు: సీఎస్‌ఈ, ఈసీఈ, మ్యాథమెటిక్స్ & డేటా సైన్స్.
అర్హతలు..
➥ సీఎస్‌ఈ/ఈసీఈ విభాగానికి కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (ఎంఈ/ఎంటెక్) లేదా ఎంఎస్ (రిసెర్చ్) ఉత్తీర్ణత ఉండాలి. (లేదా) ఎంఎస్సీ డిగ్రీ (కంప్యూటర్స్/ ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ ఈసీఈ విభాగానికి మాస్టర్స్ డిగ్రీ (ఎంఈ/ఎంటెక్) అర్హత ఉండాలి. (లేదా) సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌తోపాటు ఎంఎస్ రిసెర్చ్ (లేదా) సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్‌తోపాటు ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత ఉండాలి.
➥ మ్యాథమెటిక్స్ & డేటా సైన్స్ విభాగానికి 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ప్రవేశ విధానం: ఫుల్‌టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. అదేవిధంగా పార్ట్-టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు షార్ట్‌లిస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.05.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.06.2024.
PhD Admissions (Full-Time) Monsoon 2024 Notification