అన్వేషించండి

MBBS in Hindi: హిందీలోనూ ఎంబీబీఎస్ చదివే అవకాశం, ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు!

ఎంబీబీఎస్ మొదటి సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే పాఠ్యపుస్తకాలను హిందీలోకి అనువదించారు. మధ్యప్రదేశ్‌లోని 13 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు హిందీలో మెడిసిన్‌ను బోధించనున్నారు.

దేశంలో తొలిసారిగా ఈ విద్యా సంవత్సరం(2022-23) ఎంబీబీఎస్ కోర్సును హిందీ మాధ్యమంలో అందించేందుకు రంగం సిద్ధమైంది. గతేడాది నుంచి బీటెక్‎ కోర్సును ప్రాంతీయ భాషల్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతేడాది ఏపీలోని ఒక కళాశాలతో పాటు మొత్తం 14 కాలేజీల్లో ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ బోధించేందుకు ముందుకు వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య 20 కి పెరిగింది. తాజాగా హిందీలో ఎంబీబీఎస్ ను అందించేందుకు రెండు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని గాంధీ మెడికల్ కళాశాల, ఛత్తీస్‌గడ్‌ - బిలాస్‌పూర్‌లోని అటల్ బిహారి వాజ్‌పేయి విశ్వవిద్యాలయం దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి.

ఎంబీబీఎస్ మొదటి సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే పాఠ్యపుస్తకాలను హిందీలోకి అనువదించారు. మధ్యప్రదేశ్‌లోని 13 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో చదవనున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు హిందీలో మెడిసిన్‌ను బోధించనున్నారు. అటానమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల పాఠాలను స్థానిక భాషలో చెప్పనున్నారు. హిందీలోకి అనువదించిన ఈ పాఠ్యపుస్తకాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్టోబరు 16న విడుదల చేసి.. రాష్ట్రంలో హిందీలో వైద్య విద్యను ప్రారంభించనున్నారు. దీంతో వైద్యవిద్యను స్థానిక అధికారిక భాషలో బోధించనున్న మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ నిలువనుంది.

మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులను హిందీలో నేర్చుకోలేమని, బోధించలేమనే భావనను రూపుమాపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. హిందీ మాధ్యమంలో చదివి కూడా జీవితంలో ముందుకు సాగగలం అనే ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ఇదో ముందడుగని పేర్కొన్నారు. విద్యా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలనేది ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని సీఎం వ్యాఖ్యానించారు.

పుస్తకాల అనువాదం కోసం భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ హిందీ సెల్‌ను ఏర్పాటు చేశారు. వైద్య రంగానికి చెందిన నిపుణులను ఈ టాస్క్‌ఫోర్స్‌లో  భాగం చేశారు. వైద్య కళాశాలలకు చెందిన 97 మంది అధ్యాపకులు, నిపుణులు 5,568 గంటలకు పైగా మేధోమథనం చేసి హిందీలోకి పాఠ్యపుస్తకాలను అనువాదం చేశారు. ఆంగ్లంతోపాటు హిందీ పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, సాంకేతిక పదాలు ఇంగ్లిష్‌లోనే ఉంటాయని ఆ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ స్పష్టం చేశారు.

నిపుణుల అభ్యంతరం..
తమ రాష్ట్రంలో త్వరలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి హిందీలో ఎంబీబీఎస్ కోర్స్ ప్రవేశపెడతామని మధ్య ప్రదేశ్ సీఎం చేసిన ప్రకటనపై నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోర్సు పూర్తి చేసేందుకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ హిందీలో ఎక్కడున్నాయి అంటూ ప్రశ్నిస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికిగాను హిందీలో ఎంబీబీఎస్ కోర్సు నిర్వహిస్తామని మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రకటించారు. ప్రయోగాత్మకంగా భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో, మొదటి సంవత్సరం విద్యార్థులకు హిందీలోనే కోర్సు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.

దేశంలో మొదటిసారి తాము మాత్రమే హిందీలో మెడికల్ కోర్సు ప్రారంభిస్తున్నామని, మాతృభాషలో ఈ కోర్సు బోధిస్తున్న తొలి రాష్ట్రం తమదే అవుతుందని ఘనంగా ప్రకటించారు చౌహాన్. ఈ కోర్సు కోసం ఫిజియాలజీ, అనాటమీ, బయో కెమిస్ట్రీ వంటి కోర్సులను హిందీలో రూపొందిస్తున్నట్లు మధ్య ప్రదేశ్ వైద్య విద్యా శాఖ మంత్రి కూడా వెల్లడించారు. అయితే, ఈ నిర్ణయంపై వైద్య రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

భోపాల్‌లోని గాంధీ మెడికల్ కళాశాల, బిలాస్‌పూర్‌లోని అటల్ బిహారి వాజ్‌పేయి విశ్వవిద్యాలయం రెండూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవే. వాటిలో 15శాతం సీట్లను జాతీయ కోట కింద కేటాయించాలి. ఇలాంటి పరిస్థితుల్లో హిందీయేతర రాష్ట్రాలకు సీట్లు వస్తే ఇబ్బంది తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. వైద్య రంగానికి సంబంధించిన జర్నల్స్, ఇంగ్లీష్‍లోనే పబ్లిష్ చేస్తారని, అందువల్ల హిందీలో సరైన పాఠ్యపుస్తకాలు కనుక్కునేందుకే మూడు, నాలుగు సంవత్సరాలు పడుతుందని అభిప్రాయపడుతున్నారు.

 

:: Read Also ::

TS NMMS: తెలంగాణ ఎన్‌ఎంఎంఎస్ నోటిఫికేషన్ వచ్చేసింది! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను  నేషనల్‌ మీన్స్  కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్ష డిసెంబరు 12న నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబ‌రు 28 వరకు గడువు ఉంది. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్ష ప్రశ్నపత్రాలు ఉంటాయి. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి, దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కాలర్‌షిప్, దరఖాస్తు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


AP NMMS: ఏపీ ఎన్ఎంఎంఎస్ నోటిఫికేషన్ విడుదల, ఎంపిక ఇలా!

ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.
స్కాలర్‌షిప్, దరఖాస్తు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


COVID Scholarships: కొవిడ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్, వీరికి ప్రత్యేకం!!

ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ ఫౌండేషన్‌ సామాజిక బాధ్యతలో భాగంగా కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల కోసం ‘కొవిడ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ను ప్రకటించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ చదివే వారు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల నుంచి విద్యార్థుల పరిస్థితిని అంచనావేసి షార్ట్‌లిస్ట్‌ రూపొందిస్తారు. తర్వాత వీరికి టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి, ఎంపికైనవారికి స్కాలర్‌షిప్ అందజేస్తారు.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget