IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్), ఫిజిక్స్ విభాగంలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్(స్పెషల్ రౌండ్)లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్), ఫిజిక్స్ విభాగంలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్(స్పెషల్ రౌండ్)లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల్లో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
వివరాలు..
* పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (స్పెషల్ రౌండ్)
అర్హత: పీజీ(ఫిజిక్స్)తో పాటు యూజీసీ- జేఆర్‌ఎఫ్/ సీఎస్‌ఐఆర్- జేఆర్‌ఎఫ్/ డీఎస్టీ- ఇన్‌స్పైర్ అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, దివ్యాంగులకు రూ.250గా నిర్ణయించారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.10.2023.
ALSO READ:
నిట్ అరుణాచల్ ప్రదేశ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, అర్హతలివే
అరుణాచల్ ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) విశ్వేశ్వరయ్య ఫెలోషిప్ పథకం 2023-24 కింద పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్/ నెట్ స్కోరు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 10లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రోగ్రామ్ వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐఐటీ భువనేశ్వర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వేశ్వరయ్య ఫెలోషిప్ పథకం 2023-24 కింద పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 5లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రోగ్రామ్ వివరాల కోసం క్లిక్ చేయండి..
తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంఎస్సీ, పీజీతో పాటు గేట్/ యూజీసీ- నెట్/ సీఎస్‌ఐఆర్- నెట్/ ఎన్‌బీహెచ్‌ఎం/ ఇన్‌స్పైర్‌లో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 3లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఐఐఐటీడీఎం కర్నూల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఈ అర్హతలుండాలి
కర్నూలులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ & మాన్యుఫాక్చరింగ్ (ఐఐఐటీడీఎంకే)లో విశ్వేశరాయ ఫెలోఫిప్ స్కీమ్ కింద పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఫుల్ టైం, పార్ట్ టైం విధానంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
పీహెచ్‌డీ కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..