అన్వేషించండి

JAM 2024: ఐఐటీ జామ్-2024 దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

జామ్‌-2024 దరఖాస్తు గడువును అక్టోబరు 20 వరకు పొడిగించారు. సంబంధిత సబ్జెక్ట్‌లతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకునే వారికోసం ఉద్దేశించిన ‘జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌)-2024’ దరఖాస్తు గడువును అక్టోబరు 20 వరకు పొడిగించారు. సెప్టెంబరు 5న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 13తో ముగియాల్సిన గడువును పొడిగించారు. సంబంధిత సబ్జెక్ట్‌లతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ ఏడాది ఐఐటీ మద్రాస్ ఈ ఏడాది 'జామ్' పరీక్ష నిర్వహించనుంది. 

దేశవ్యాప్తంగా ఉన్న 21 ఐఐటీలు అందిస్తున్న వివిధ పీజీ ప్రోగ్రామ్‌లలో సుమారు 3000 సీట్లను జామ్‌ స్కోర్‌ ద్వారా భర్తీ చేస్తారు. వీటితోపాటు నిట్‌లు(NIT), ఐసర్లు(IISER), ఐఐఎస్సీ(IISC), ఐఐఈఎస్‌టీ(IIEST), డీఐఏటీ(DIAT), ఐఐపీఈ(IIPE), జేఎన్‌సీఏఎస్‌ఆర్‌ (JNCASR), ఎస్‌ఎల్‌ఐఈటీ (SLIET) సహా మొత్తం 30 సీఎఫ్‌టీఐ సంస్థల్లోని 2300కు పైగా సీట్ల భర్తీకి ఈ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటారు.

వివరాలు..

జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ - (JAM) 2024

కోర్సులు:

1) ఎంఎస్సీ

2) ఎంఎస్సీ (టెక్)

3) ఎంఎస్‌ (రిసెర్చ్‌)

4) ఎంఎస్సీ-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ 

5) జాయింట్‌ ఎంఎస్సీ- పీహెచ్‌డీ

6) ఎంఎస్సీ- పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ

అర్హత: అభ్యర్థి జామ్‌లో ఎంచుకొన్న పేపర్‌/ పేపర్లను అనుసరించి సంబంధిత సబ్జెక్ట్‌లతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలకు సన్నద్దమవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు:
JAM 2024: ఐఐటీ జామ్-2024 దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం:

➥ కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించే పరీక్షలో ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో మొత్తం 60 ప్రశ్నలకుగాను 100 మార్కులు కేటాయించారు. పేపర్లో మూడు సెక్షన్‌లు ఉంటాయి. 

➥ మొదటి సెక్షన్‌లో (సెక్షన్-ఎ) 30 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. వీటిలో పది ప్రశ్నలకు ఒక్కోదానికి ఒక మార్కు, మిగిలిన 20 ప్రశ్నలకు ఒక్కోదానికి రెండు మార్కులు నిర్దేశించారు. 

➥ రెండో సెక్షన్‌లో (సెక్షన్-బి) 10 మల్టిపుల్‌ సెలెక్ట్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకూ ఒకటి లేదా అంత కంటే ఎక్కువ సమాధానాలు ఉంటాయి. వాటన్నింటినీ గుర్తించాలి. ప్రశ్నకు రెండు మార్కులు ప్రత్యేకించారు. 

➥ మూడో సెక్షన్‌లో (సెక్షన్-సి) 20 న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో పది ప్రశ్నలకు ఒక్కోదానికి ఒక మార్కు మిగిలిన పది ప్రశ్నలకు ఒక్కోదానికి రెండు మార్కులు ప్రత్యేకించారు. వీటికి ఆప్షన్స్‌ ఇవ్వరు. ఒక నెంబర్‌ను సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. 

➥ మొదటి సెక్షన్‌లో మాత్రమే నెగెటివ్‌ మార్కులు వర్తిస్తాయి. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే కేటాయించిన మార్కుల్లో మూడోవంతు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. 

జామ్‌ పేపర్లు: జామ్‌ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌లో కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్‌ పేపర్లు; మధ్యాహ్నం సెషన్‌లో బయోటెక్నాలజీ, ఎకనామిక్స్‌, మ్యాథమెటిక్స్‌ స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌ పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు గరిష్ఠంగా రెండు పేపర్లు రాయవచ్చు. రెండు పేపర్లు రాసేవారు ఉదయం సెషన్‌ నుంచి ఒక పేపర్‌, మధ్యాహ్నం సెషన్‌ నుంచి మరో పేపర్‌ ఉండేలా చూసుకోవాలి. 

JAM 2024: ఐఐటీ జామ్-2024 దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, ఒంగోలు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.09.2022 

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 11.10.2022 

➥ పరీక్ష తేదీ: 12.02.2023

➥ ఫలితాలు వెల్లడి: 22.03.2023 

➥ ప్రవేశాలు: 11.04.2023 - 25.04.2023 

Notification

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Study in Germany: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Adilabad News: తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget